హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Debts | CAG : జగన్ సర్కారు అప్పులు తక్కువే! -కాగ్ రిపోర్టులో అనూహ్య లెక్కలు..

AP Debts | CAG : జగన్ సర్కారు అప్పులు తక్కువే! -కాగ్ రిపోర్టులో అనూహ్య లెక్కలు..

ఏపీ అప్పులపై కాగ్ అకౌంట్స్

ఏపీ అప్పులపై కాగ్ అకౌంట్స్

ఏపీని అప్పుల కుప్పగా మార్చారని విమర్శలు వస్తోన్న వేళ జగన్ సర్కారుకు సానుకూలంగా కాగ్ రిపోర్టు వెలువడింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన, చేస్తోన్న అప్పులు తక్కువేనని గణాంకాల్లో తేలింది. వివరాలివే..

ఇంకా చదవండి ...

మరో శ్రీలంకలా ఆంధ్రా ఆర్థిక దుస్థితి.. వైసీపీ పాలనలో దీవాళా దిశగా ఏపీ.. అంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తోన్న తరుణంలో జగన్ సర్కారుకు సానుకూలంగా ఉన్న కీలక రిపోర్టు తాజాగా వెలువడింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన, చేస్తోన్న అప్పులు తక్కువేనని గణాంకాల్లో తేలింది. కేంద్రం పరిధిలోని స్వతంత్ర్య రాజ్యాంగ సంస్థ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్) గతే ఆర్థిక ఏడాది (2021–22)కి సంబంధించి వెలువరించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

అప్పుల విషయంలో జగన్ సర్కారు పారదర్శకంగా వ్యవహరిస్తోందని, కోవిడ్‌ సంక్షోభం వల్ల ఆదాయం పడిపోయి, ఖర్చులు పెరిగినప్పటికీ బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట పరిమితులకు లోబడే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని కాగ్‌ గణాంకాలు చెప్పాయని, ద్రవ్య లోటును తగ్గించే దిశగానూ వైసీపీ సర్కారు అడుగులు వేస్తోందని, 2021–22 ఆర్థిక ఏడాదిలో ఏపీ చేసిన అప్పులు ఇతర రాష్ట్రాల కంటే తక్కువేనని కాగ్ చేసిన అప్పులే ఎక్కువ అని కాగ్ రిపోర్టులో వెల్లడైంది. ఈ మేరకు సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది.

Ayyanna Patrudu : పులివెందుల పిల్లి భయపడింది.. ఇక చంపడమే మిగిలింది : టీడీపీ ఫైర్


కాగ్‌ ప్రాథమిక అకౌంట్స్‌ ప్రకారం తెలంగాణ, కర్ణాటకలు 2021–22 బడ్జెట్‌ అంచనాలకు మించి అప్పులు చేశాయి. గతేడాది తెలంగాణ రూ.47,690.59 కోట్లు, కర్ణాటక రూ.60,486.26 కోట్ల అప్పులు పొందాయి. అయితే ఏపీ మాత్రం బడ్జెట్‌ అంచనాల్లో రూ.37,029.79 కోట్లు అప్పు చేయనున్నట్లు పేర్కొని, వాస్తవంగా రూ.25,194.62 కోట్లు మాత్రమే (68.04 శాతం) అప్పు చేసింది. అంటే ఇంకా 31.96 శాతం మేర అప్పు చేయడానికి అవకాశం ఉన్నా చేయలేదని కథనంలో రాశారు.

Rythu Bandhu : రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి రూ.7,700 కోట్లు రైతు బంధు.. ఎప్పుడంటే..


2021–22 ఆర్థిక ఏడాదిలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతి తక్కువగా ద్రవ్య లోటు ఉన్నట్లు కాగ్ రిపోర్టులో ఉంది. ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేసిన నికర అప్పుగా పేర్కొంటారు. 15వ ఆర్థిక సంఘం జీఎస్‌డీపీలో 4.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యంగా నిర్ధారించగా, జగన్ సర్కారు ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల ద్రవ్యలోటు 2.10 శాతానికే పరిమితమైందని, అలాగే రెవెన్యూ లోటును రూ.8,370.51 కోట్లకే పరిమితం చేసిందని కాగ్ పేర్కొంది.

టీడీపీ గత ఐదేళ్ల పాలనలో జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3% పరిమితికి మించి ఉండేదని, అలాంటి జగన్ హయాంలో ద్రవ్యలోటును గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 2021–22లో 2.10 శాతానికి పరిమితం అయిందని, వైసీపీ ప్రభుత్వం విచక్షణ వల్లే ఇది సాధ్యమైందని కథనంలో రాశారు. వాస్తవాలు ఇలా ఉంటే, అప్పుల విషయంలో ప్రతిపక్ష టీడీపీ అబద్దాలు ప్రచారం చేస్తోందని, ఆర్‌బీఐ ఆరా, కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు తాఖీదులంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

TRSలో కొత్త సీన్: KCR అసంతృప్తులకు KTR బుజ్జగింపులు -మొన్న పొంగులేటి, నిన్న జూపల్లితో..


2021–22 ఆర్థిక ఏడాదిలో అంతకు ముందు రెండేళ్ల కంటే కొంత మేర ఏపీ ఆదాయం 84.96% శాతం మేర మెరుగుపడిందని, డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు ఏకంగా రూ.1.41 లక్షల కోట్లు జమ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు వీలుగా నవరత్నాలకు వినియోగించిందని, వైద్య, విద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కార్యక్రమాలను చేపట్టామని ఏపీ ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. గత చంద్రబాబు ఐదేళ్ల పాలనతో సగటు వార్షిక అప్పు వృద్ధి రేటు 19.46 శాతం ఉండగా, జగన్ పాలనలోని మూడేళ్లలో సగటు వార్షిక అప్పు 15.77 శాతమే ఉందని కథనంలో పేర్కొన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, TDP, Ys jagan, Ysrcp

ఉత్తమ కథలు