హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ys Jagan: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..ఆ పిటిషన్ తిరస్కరణ

Ys Jagan: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..ఆ పిటిషన్ తిరస్కరణ

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో తమపై దాఖలైన కేసును క్వాష్ చేయాలని హెటిరో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా హెటిరో పిటీషన్ పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పక్కాగా ఛార్జిషీటు దాఖలు చేసిందన్న సుప్రీం ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేసును కొట్టేయాలన్న హెటిరో అభ్యర్ధనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో హెటిరో కంపెనీ విచారణ ఎదుర్కోవాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. కాగా గత ఏడాది ఈ కేసులో హెటిరో గ్రూప్ ను తొలగించాలన్న పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అయితే దీనిని సవాల్ చేస్తూ హెటిరో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

వైఎస్ జగన్ (Ys Jagan) అక్రమాస్తుల కేసుల్లో తమపై దాఖలైన కేసును క్వాష్ చేయాలని హెటిరో సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. తాజాగా హెటిరో పిటీషన్ పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పక్కాగా ఛార్జిషీటు దాఖలు చేసిందన్న సుప్రీం ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలని న్యాయస్థానం (Supreme Court) అభిప్రాయపడింది. కేసును కొట్టేయాలన్న హెటిరో అభ్యర్ధనను సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది. ఈ కేసులో హెటిరో కంపెనీ విచారణ ఎదుర్కోవాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. కాగా గత ఏడాది ఈ కేసులో హెటిరో గ్రూప్ ను తొలగించాలన్న పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టేసింది. అయితే దీనిని సవాల్ చేస్తూ హెటిరో సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది.

Kiran Kumar Reddy: చంద్రబాబు తరహాలోనే కిరణ్ కుమార్ రెడ్డి మనసు విప్పుతారా ?.. అందరిలోనూ ఆసక్తి

కాగా ఇటు అరబిందో, అటు హెటిరో సంస్థలకు జడ్చెర్ల సెజ్ లో భూకేటాయింపుపై దాఖలు చేసిన చార్జిషీట్ లో శ్రీనివాస్ రెడ్డి, హెటిరో సంస్థను నిందితుల జాబితాలో సిబిఐ చేర్చింది. అయితే జగన్ సంస్థలో పెట్టుబడులు వ్యహంలో భాగమని సిబిఐ అభియోగాల్లో నిజం లేదని హెటిరో తరపు న్యాయవాదులు వాదించారు. భూకేటాయింపులో కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. అయితే అప్పటి జగన్ సర్కార్ హెటిరో సంస్థకు తక్కువ ధరకు భూమి కేటాయించారని సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. జగతి సంస్థలో జగన్ పెట్టుబడి పెట్టకుండానే ఇతరులతో ఏకంగా రూ.1246 కోట్లు పెట్టుబడిగా పెట్టించారని ఆరోపించారు. అయితే అధికారంతో ఆ డబ్బులను తన సంస్థల్లోకి మలుపుకున్నారని చార్జిషీట్ లో తేలింది. అలాగే జగన్ సంస్థల్లో హెటిరో పెట్టుబడి పెట్టిందని అందుకు జగన్ వారికి 50 ఎకరాల భూమిని కూడా కేటాయించిందని సిబిఐ చెప్పింది. అందుకే హెటిరో ఎండి శ్రీనివాస్ ను నిందితునిగా చేర్చామని చెప్పుకొచ్చారు.

ఇక జగతిలో వాటాలను ఇతరులకు అమ్మడానికి వీల్లేదని , వాటాదారులు కుటుంబసభ్యులకు మాత్రమే బదలాయించాలన్నా షరతు ఉంది. వాటాలను విక్రయించుకోకుండా..లాభాలు లేకుండా పెట్టుబడులు పెట్టారు. హెటిరో సంస్థ రూ.1,173 కోట్లు పెట్టుబడి పెట్టి 30 శాతం వారికీ దక్కింది. కానీ జగన్ మాత్రం కేవలం రూ.73 కోట్ల పెట్టుబడితో 70 శాతం వాటా పొందారన్నారు. ఆ 73 కోట్లు కూడా కార్మెల్ ఏసియా, సండూరు పవర్ ల నుంచి వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తాయని సీబీఐ వాదిస్తుంది.

First published:

Tags: Ap, Ap cm jagan, Supreme Court

ఉత్తమ కథలు