సర్కారీ సొమ్ము వాపస్... జగన్ మరో సంచలన నిర్ణయం...

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదు.గత ఆరు నెలల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సుమారు రూ.25వేల కోట్ల అప్పులు చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది.

news18-telugu
Updated: December 8, 2019, 10:51 PM IST
సర్కారీ సొమ్ము వాపస్... జగన్ మరో సంచలన నిర్ణయం...
ఏపీ సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో జీవోను ఉపసంహరించుకున్నారు. గతంలో సీఎం క్యాంప్ కార్యాలయం కోసం కేటాయించిన నిధులను మళ్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రెండు రోజుల క్రితం సుమారు మూడున్నర కోట్ల విలువైన పనులకు సంబందించిన జీవో లు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా సెంట్రల్ విద్యుత్ పనుల కోసం కేటాయించిన రూ.3.63 కోట్ల నిధులకు సంబంధించిన జీవోను ప్రభుత్వం రద్దు చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు గతంలో ఇచ్చిన జీవోలను రద్దు చేస్తూ అధికారులు కొత్త జీవోలను జారీ చేస్తున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం, అధికారిక నివాసాలకు ప్రభుత్వం తరఫున నిధులు వెచ్చించే అవకాశం ఉంది. గతంలో కూడా ముఖ్యమంత్రులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. అయితే, జగన్ మాత్రం దీన్ని వద్దని తిప్పి పంపుతున్నారు. తన ప్రభుత్వంలో జారీ అయిన జీవోను మళ్లీ ఆయనే ఉపసంహరిస్తున్నారు.

నిధులను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో


ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.2.58లక్షల కోట్ల అప్పులు చేపి వెళ్లిందంటూ అధికార వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. గత ఆరు నెలల కాలంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సుమారు రూ.25వేల కోట్ల అప్పులు చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నివాసానికి, ఇతర ఖర్చులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను జగన్ మళ్లీ ఉపసంహరించుకున్నారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>