YS JAGAN GOVT TRANSFERS SEVERAL IAS OFFICERS GANDHAM CHANDRUDU APPOINTED AS SOCIAL WELFARE SECRETARY MKS
AP IAS: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. Gandham Chandruduకు సోషల్ వెల్ఫేర్.. పూర్తి జాబితా ఇదే..
ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు
పరిపాలనలో తనదైన శైలిలో ముందుకు పోతున్న సీఎం జగన్ ఆ మేరకు కీలక శాఖలకు కొందరు అధికారుల్ని ఏరికోరి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వివరాలివి..
పరిపాలనలో తనదైన శైలిలో ముందుకు పోతున్న సీఎం జగన్ ఆ మేరకు కీలక శాఖలకు కొందరు అధికారుల్ని ఏరికోరి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సీఎం జగన్ సూచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శి కె.సునీతను మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా, మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గంధం చంద్రుడిని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం ఆ స్థానంలో పనిచేస్తున్న రేఖారాణిని కాపు కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. కాపు కార్పొరేషన్ ఎండీగా ఉన్న అనంతరామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించారు.
సీసీఎల్ఏ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రంజిత్ బాషాను విజయవాడ కమిషనర్‌గా బదిలీ చేశారు. అలాగే ఏపీ భవన్ ప్రత్యేక అధికారి ఎన్వీ రమణారెడ్డిని ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవోగా నియమించారు.
ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేక అధికారిగా అక్కడ అదనపు కమిషనర్‌గా ఉన్న హిమాన్షు కౌశిక్‌కు బాధ్యతలు అప్పగించారు. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓగా ఉన్న ఆర్. పవన్‌మూర్తిని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.