Home /News /andhra-pradesh /

YS JAGAN GOVT RECOGNIZE URDU AS SECOND OFFICIAL LANGUAGE ACCORDING TO AP OFFICIAL LANGUAGE AMENDMENT ACT MKS

AP govt | Urdu language : జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు.. రెండో అధికార భాషగా ఉర్దూ

ఏపీ సీఎం జగన్ (పాత ఫొటో)

ఏపీ సీఎం జగన్ (పాత ఫొటో)

ఏపీలో ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషల చట్ట సవరణ–2022కు సంబంధించి మార్పులు చేశారు. వివరాలివే..

ఉర్దూ భాషపై పలు రాష్ట్రాల్లో వివాదాలు కొనసాగుతున్న సమయంలో వైఎస్ జగన్ (YS Jagan) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఉర్దూను రెండో అధికారిక భాషగా (Urdu as Second Official Language In AP) గుర్తిస్తూ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషల చట్ట సవరణ–2022కు సంబంధించి మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏపీలో ఉర్దూ భాషకు అధికారిక హోదాకు సంబంధించి మూడు నెలల కిందటే అసెంబ్లీలో బిల్లు పాసైన సంగతి తెలిసిందే. మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లోనే ఉర్దూకు రెండో అధికార భాష హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషల చట్ట సవరణ–2022కు సభ ఆమోదం తెలపడం చకచకా జరిగిపోగా, ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలు కానుండటంతో దానిపై అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.


Sai Pallavi | Vijayashanthi : సాయి పల్లవిపై విజయశాంతి అనూహ్య స్పందన.. అలాంటి సమాజంలో ఉన్నాం..


వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాషగా చట్టబద్ధత కల్పించింది. ఏపీలో మాత్రం గత టీడీపీ హయాంలో ఉర్దూకు గుర్తింపునివ్వలేదు. మైనార్టీలు, ఉర్దూ ప్రేమికుల ఆవేదనను గుర్తించిన సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూకు స్థానం కల్పించారని తెలుస్తోంది.


Hyderabad : బాలికపై పదే పదే అత్యాచారం.. గర్భం దాల్చడంతో.. బెదిరించి అబార్షన్‌


తాజా నోటిఫికేషన్ తో రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టైంది. కాగా, ఉర్దూ భాషకు అధికారిక గుర్తింపుపై పలు రాష్ట్రాల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ ఊర్దూకు అధికారిక హోదా, ఉర్దూలో పరీక్షల నిర్వహణను బీజేపీ వ్యతిరేకిస్తున్నది. మరి ఏపీ సర్కారు నిర్ణయంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి..
Published by:Madhu Kota
First published:

Tags: Andhra Pradesh, AP News, Urdu, Ys jagan

తదుపరి వార్తలు