ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులపై జగన్ కీలక నిర్ణయం...

ప్రస్తుతం ఉన్న రంగులను మార్చి కొత్త రంగులను వేయాలా? లేకపోతే ఉన్న రంగుల్లోనే కొన్ని మార్పులు చేయాలా? అనే విషయాన్ని పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది.

news18-telugu
Updated: April 2, 2020, 11:03 PM IST
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులపై జగన్ కీలక నిర్ణయం...
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
రాష్ట్రంలో పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులను మార్చాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వాటిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై సీసీఎల్ఏ (భూ పరిపాలన ప్రధాన కమిషనర్) ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న రంగులను మార్చి కొత్త రంగులను వేయాలా? లేకపోతే ఉన్న రంగుల్లోనే కొన్ని మార్పులు చేయాలా? అనే విషయంలో ఆ కమిటీ పరీశీలించి నివేదిక అందిస్తుంది. వారం రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గుర్తులను వేశారంటూ టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు వెంటనే ఆ రంగులను చెరిపివేయాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ ప్రభుత్వం. అక్కడ కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ కార్యాలయాలకు తమ పార్టీ రంగులు వేసుకుంటే, కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకు కాషాయ రంగు వేస్తే ఊరుకుంటారా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. దీంతో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
First published: April 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading