నిమ్మగడ్డ కేసు... సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం ?

ఏపీ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించాలని హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: May 29, 2020, 12:50 PM IST
నిమ్మగడ్డ కేసు... సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం ?
నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైఎస్ జగన్
  • Share this:
ఏపీ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించాలని హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన తీర్పు కాపీలు అందగానే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పలువురు సీనియర్ల లాయర్లతో ఏపీ సర్కార్ చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఏపీ ఎస్ఈసీగా తనను తిరిగి నియమించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు. హైకోర్టు సూచనలతో విధుల్లో చేరతానని ప్రకటించారు. నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి త్వరలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తానని అన్నారు. వ్యక్తులు శాశ్వతం కాదని, రాజ్యాంగం శాశ్వతమని ఆయన వెల్లడించారు.




First published: May 29, 2020, 12:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading