జగన్ సర్కారులో టీటీడీ వివాదాలు.. థర్టీ ఇయర్స్ పృథ్వీ నుంచి రామాయణం దాకా..

వైఎస్ జగన్ సర్కారులో వరుసగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు వివాదాన్ని సృష్టిస్తున్నాయి. తిరుమల ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం మొదలు.. రామాయణ కథ వరకు పలు ఘటనలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి.

news18-telugu
Updated: June 3, 2020, 11:15 AM IST
జగన్ సర్కారులో టీటీడీ వివాదాలు.. థర్టీ ఇయర్స్ పృథ్వీ నుంచి రామాయణం దాకా..
తిరుమలలో సాయంత్రం 6.20 గంటలకు సీఎం జగన్ శ్రీ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
  • Share this:
(బాలకృష్ణ.ఎమ్, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్18)

వైఎస్ జగన్ సర్కారులో వరుసగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు వివాదాన్ని సృష్టిస్తున్నాయి. తిరుమల ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం మొదలు.. రామాయణ కథ వరకు పలు ఘటనలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. థర్టీ ఇయర్స్ పృథ్వీ వ్యవహారం అయితే తీవ్ర సంచలనం రేపింది. చివరికి ఆయన్ను పదవి నుంచే తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నకి మొన్న టీటీడీ భూములు విక్రయించాలన్న నిర్ణయంపైనా కొన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. లడ్డూ ప్రసాద విక్రయంలోనూ వివాదం. ఇక.. టీటీడీకి చెందిన సప్తగిరి మాసపత్రికలో రామాయణ కథలో కుశుడు సీతారాములకు పుట్టలేదని, గడ్డితో చేసిన బొమ్మ అన్న వ్యాఖ్యలు రాజకీయంగానూ దుమారం రేపుతున్నాయి.

ఈ వరుస వివాదాలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీరియస్‌గా ఉన్నారు. టీటీడీలో కొంతమంది కోవర్టులుగా పనిచేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రామాయణ కథ వివాదంపై ఆగ్రహంతో ఉన్న ఆయన ఈ అంశంపై చ‌ర్యలకు ఆదేశించామని తెలిపారు. ‘సంబంధిత ఎడిట‌ర్‌పై చర్యలు తీసుకుంటున్నాం. అంతర్గతంగా దేవాలయ ప్రతిష్ఠను కించపరిచేందుకు, హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి కారణమవుతున్న వారిపై చర్యలకు ప్రత్యేక కమిటీ వేశాం. వివాదాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నవారిపై దృష్టి పెట్టాం. ఎవరు తప్పు చేసినా ఊరుకోం’ అని ఆయన న్యూస్18తో చెప్పారు.

ఈ వ్యవహారంపై హిందూ ధార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఒక పెద్ద ధార్మిక సంస్థ అయిన టీటీడీ ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందంటూ వ్యాఖ్యానిస్తున్నాయి. ‘వాస్తవానికి మ‌న‌కు ఉన్న రామాయ‌ణం ఒక్కటే.. అదే సంపూర్ణ రామాయ‌ణం. మిగిలిన‌వ‌న్నీ కల్పితాలు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థ త‌న‌కు ఎటువంటి క‌థ వ‌చ్చింది? అందులో ఏం అంశం ఉంది? అని చూడకుండా సంపూర్ణ రామాయ‌ణాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా ఎవ‌రు ప‌డితే వాళ్లు రాసిన విష‌యాల‌ను దేవ‌స్థానానికి చెందిన మాస ప‌త్రిక‌లో రాయ‌డం ఘోరం. దీనిపై విచారణ జరిపి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి’ అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీనివాసమూర్తి తెలిపారు.

ప్రతిపక్షాలు కూడా జగన్ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి. ‘జగన్ ప్రభుత్వం హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకుంటోంది. ఎవ‌రు ప‌డితే వాళ్లు ఏం రాసిస్తే అది ప్రచురిస్తారా? కనీసం అందులో ఏం రాశారో చెక్ చేసుకోరా? ఇది చాలా దారుణం. ఒక విధంగా హిందుమ‌తంపై దాడిగానే ప‌రిగ‌ణించాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి న్యూస్18తో వెల్లడించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 3, 2020, 11:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading