ఇంగ్లీష్ మీడియంపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కారు..

ఇంగ్లీష్ మీడియం బోధనపై హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

news18-telugu
Updated: June 5, 2020, 6:58 AM IST
ఇంగ్లీష్ మీడియంపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కారు..
సీఎం జగన్
  • Share this:
ఇంగ్లీష్ మీడియం బోధనపై హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధననే కొనసాగిస్తూ జగన్ సర్కారు ఇచ్చిన జీవోలు 81, 85లను హైకోర్టు రద్దు చేసింది. మాతృభాషలోనే ప్రాథమిక విద్య కొనసాగాలని ఆదేశించింది. దీంతో ఈ కేసుపై సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని సర్కారు నిర్ణయించింది. 80 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియాన్నే కోరుకుంటున్నారని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు పిటిషన్లో పేర్కొంది. పేద విద్యార్థుల కోసమే ఇంగ్లీష్ మీడియం బోధనను తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపింది.

హైకోర్టులో జీవోలు కొట్టి వేసిన తర్వాత తల్లిదండ్రుల వద్ద నుంచి వలంటీర్ల ద్వారా అఫిడవిట్లు సేకరించింది ఏపీ సర్కార్. వాటిని సుప్రీంకోర్టులో వాదనలకు ఉపయోగించుకోనుంది. దీనికి సంబంధించిన కేసులో త్వరలోనే వాదనలు ప్రారంభం కానున్నాయి.
First published: June 5, 2020, 6:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading