Home /News /andhra-pradesh /

YS JAGAN GAVE BANDAR PORT TO TELANGANA AS A QUID PRO QUO ALLEGES TDP BA

బందరు పోర్టును ఎంతకు అమ్మేశారు?.. జగన్‌కు టీడీపీ ప్రశ్న

జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్)

జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్)

గత ఎన్నికల్లో జగన్‌కు కేసీఆర్ ఆర్థికసాయం చేసినందుకే బందరు పోర్టును తెలంగాణకు అప్పగించేశారని టీడీపీ ఆరోపిస్తోంది.

    బందరు పోర్టును తెలంగాణ ప్రభుత్వానికి ఎంతకు అమ్మేశారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి రూ.1500 కోట్ల ఆర్థికసాయం చేసినందుకు క్విడ్ ప్రో కో గా బందరు పోర్టును తెలంగాణకు ఇచ్చేశారని దేవినేని ఉమా ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే పోర్టులో ఉన్న యంత్రాలు వెళ్లిపోయాయన్నారు. దీంతోపాటు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి భారీ ఎత్తున లబ్ధి పొందారని ఆరోపణలు ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ మీద కూడా దేవినేని ఉమా మాట్లాడారు. సెర్బియా పోలీసులు నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్ట్ చేస్తే దానిపై జగన్ మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదని దేవినేని ఉమా ప్రశ్నించారు. పొద్దున లేస్తే ట్వీట్లు చేసే విజయసాయిరెడ్డి దీనిపై ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నించారు. బందరు పోర్టుకు సంబంధించి జగన్ ప్రభుత్వం ఇచ్చిన రహస్య జీవోలను బహిర్గతం చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. బందరు పోర్టుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బెదిరింపుల వల్ల నిర్మాణ పనుల నుంచి కాంట్రాక్ట్ సంస్థ వెనక్కి వెళ్లిపోతోందని కొల్లు రవీంద్ర ఆరోపించారు.
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, CM KCR, Machilipatnam S01p11, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు