జగన్‌కి మేలుచేసిన కేసీఆర్... వైసీపీ హ్యాపీ

Andhra Pradesh : రాజకీయాల్లో తెలివిగా ఎత్తుగడలు వెయ్యాలి. ఆ విషయంలో వైఎస్ జగన్ ఇప్పటివరకూ బాగానే నెగ్గుకొస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీల విషయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

news18-telugu
Updated: December 8, 2019, 5:37 AM IST
జగన్‌కి మేలుచేసిన కేసీఆర్... వైసీపీ హ్యాపీ
వైఎస్ జగన్, కేసీఆర్
  • Share this:
Andhra Pradesh : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే... వాళ్లను విధుల్లోంచీ తొలగిస్తున్నట్లు ప్రకటించి... తిరిగి విధుల్లోకి తీసుకొని... వాళ్లకు మేలు చేసినట్లుగా వ్యవహరించి... చివరకు ఆర్టీసీ ఛార్జీలు పెంచి... ప్రజలకు షాక్ ఇచ్చారు సీఎం కేసీఆర్. కిలోమీటర్‌కి 20 పైసలు పెంచినట్లు చెబుతున్నా... రౌండప్ పేరుతో... ఏకంగా ఐదేసి రూపాయలు వడ్డించేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు తెలంగాణ సీఎం. ఐతే... తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో... ఏపీ ప్రభుత్వం కూడా అదే ఊపులో ఆర్టీసీ ఛార్జీలు పెంచేసింది. ఐతే, ప్రజల నుంచీ విమర్శలు రాకుండా ఉండేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలివిగా వ్యవహరించారు. పల్లెవెలుగు, సిటీ సర్వీస్‌పై కిలోమీటర్‌కు 10 పైసలు, మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్‌కు 20 పైసలు మాత్రమే పెంచామని చెప్పిస్తూ... తెలంగాణ ప్రభుత్వం కంటే తక్కువగానే ఛార్జీలు పెంచినట్లుగా ప్రజలు భావించేలా చేసుకున్నారు. ఆల్రెడీ తెలంగాణలో పెంచారు కాబట్టి... ఏపీలోనూ పెంచారన్న అభిప్రాయం ప్రజల్లో వచ్చేలా చేసుకున్నారు. తద్వారా ఆదాయం పెంచుకొని నష్టాల్ని తగ్గించుకునేందుకు వీలవ్వబోతోంది.

ఏపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల్ని విలీనం చేసుకున్నప్పుడే జగన్... ఆర్టీసీ ఛార్జీలను పెంచి ఉంటే... కచ్చితంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమయ్యేదే. అందుకే ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో అలాంటి నిర్ణయం తీసుకోకుండా జగన్ జాగ్రత్త పడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ ఖజానాకు నిధులు కావాలి. నష్టాల్ని తగ్గించుకోవాలి. ఇందుకు ఆర్టీసీ ఛార్జీలను పెంచితే... ఏపీలో ఆర్టీసీకి ఏటా వచ్చే రూ.1200 కోట్ల నష్టాన్ని భర్తీ చేసుకోవడానికీ, మరిన్ని నిధులు పొందేందుకూ వీలయ్యే ఛాన్స్ ఉండటంతో... తెలంగాణ ప్రభుత్వం ఛార్జీలు పెంచగానే... జగన్ కూడా పెంచేశారు. ఇలా పరోక్షంగా తెలంగాణ సీఎం కేసీఆర్... వైఎస్ జగన్‌కు మేలు చేసినట్లైంది.

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే... తెలంగాణలోనూ చెయ్యాలనే డిమాండ్ వినిపించినా... కేసీఆర్ అందుకు ససేమిరా అన్నారు. తద్వారా ఏపీ నిర్ణయాలు వేరు, తమ నిర్ణయాలు వేరు అనిపించారు. కానీ ఆర్టీసీ ఛార్జీల పెంపు విషయంలో మాత్రం.... తెలంగాణ ప్రభుత్వ బాటలోనే వెళ్లి... ఏపీ ప్రభుత్వం... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నిర్ణయాలు రెండూ దాదాపు ఒకే రకం అని అనుకునేలా చేశారు.

ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీకి రూ.6735 కోట్ల అప్పు ఉంది. బ్యాంకులు, వివిధ సంస్థల నుంచి తెచ్చిన అప్పులు రూ.2995 కోట్లు ఉంటే, ఇతరత్రా బకాయిలు అన్నీ కలిపి రూ.3,740 కోట్లు అయ్యాయి. ఏటా 30 కోట్ల లీటర్ల డీజిల్‌ను ఆర్టీసీ వాడుతోంది. డీజిల్ ధరల పెరుగుదల వల్ల కూడా ఆర్టీసీపై భారం ఉంది. 2015లో డీజిల్ ధరలు లీటర్ సుమారు రూ.50 ఉంటే, ఇప్పుడు లీటర్ రూ.70 వరకు చేరింది. డీజిల్ ధరల పెరుగుదల వల్ల సంస్థ మీద ఏటా సుమారు రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు భారం పెరుగుతోంది. ఆ నష్టాల్ని నివారించేందుకు, ఆర్టీసీకి జీవం పోసేందుకు ఛార్జీలు పెంచింది ప్రభుత్వం. 2015 తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెరగడం ఇదే తొలిసారి. ఐతే... పెంచిన ఛార్జీలు ఎప్పటి నుంచీ అమల్లోకి వచ్చేదీ ఇంకా ప్రభుత్వం స్పష్టం చెయ్యలేదు. 

Pics : హాట్ పకోడీలా అదరగొడుతున్న జినాల్ జోషీ


ఇవి కూడా చదవండి :

Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి

Health Tips : ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు


Health Tips : చక్కటి ఆరోగ్యానికి 5 సూత్రాలు... పాటిస్తే ఎంతో మేలు


Health Tips : టమాటాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...


Health Tips : పార్కులో 20 నిమిషాలు నడవండి... ఎంతో ఆరోగ్యం

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>