ఏపీలో కొత్తగా 5 క్యాన్సర్ ఆస్పత్రులు, 3 మెడికల్ కాలేజీలు..ఎక్కడంటే..

2021 సెప్టెంబర్ నాటికి అన్ని రకాల పరికరాలను అందుబాటులో ఉంచాలని, జూన్ 2022 నాటి ప్రభుత్వ ఆస్పత్రులన్నీ మెరగుపడాలని అధికారులకు చెప్పారు జగన్.

news18-telugu
Updated: August 13, 2019, 10:33 PM IST
ఏపీలో కొత్తగా 5 క్యాన్సర్ ఆస్పత్రులు, 3 మెడికల్ కాలేజీలు..ఎక్కడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో వైద్యఆరోగ్య వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రజలకు మెరుగైన వైద్య అందించేలా ఆస్పత్రులను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం వైద్యఆరోగ్యశాఖపై అధికారులో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ఏపీలో కొత్తగా 5 క్యాన్సర్, 2 కిడ్నీ ఆస్పత్రులు, 3 మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. విశాఖ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, కడపలో అధునాతన సదుపాయాలతో క్యాన్సర్ ఆస్పత్రులు చేయనున్నట్లు జగన్ తెలిపారు. శ్రీకాకుళం ప్రకాశం జిల్లాలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని వెల్లడించారు. ఇక పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు జగన్. సెప్టెంబరు, అక్టోబరులో వీటికి శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు.


ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల రూపు రేఖలను మార్చాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రులను ఏ ప్లస్ కేటగిరీలోని తీసుకురావాలని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, పరీక్షల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా..సకల వసతులు కల్పించాలని స్పష్టంచేశారు. 2021 సెప్టెంబర్ నాటికి అన్ని రకాల పరికరాలను అందుబాటులో ఉంచాలని, జూన్ 2022 నాటి ప్రభుత్వ ఆస్పత్రులన్నీ మెరగుపడాలని అధికారులకు చెప్పారు జగన్. సీఎం ఆదేశం మేరకు ఆస్పత్రుల ప్రస్తుత స్థితిని ఇప్పటికే ఫొటోలు తీశారు అధికారులు. మరమ్మతులు చేసిన తర్వాత మరోసారి ఫొటోలు తీసి..ఆ రెండింటినీ చూపించాల్సి ఉంటుంది. ఇక జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో వైఎస్ఆర్ క్యాంటిన్లను ఉండాలని అధికారులకు సూచించారు జగన్.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు