హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ సీఎంగా జగన్ పాలనకు 90 రోజులు... ఎలా సాగిందంటే...

ఏపీ సీఎంగా జగన్ పాలనకు 90 రోజులు... ఎలా సాగిందంటే...

Andhra Pradesh : భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ... ప్రజల అంచనాల్ని అందుకుందా? మాట తప్పం... మడమ తిప్పమని చెప్పే వైఎస్ జగన్... ఎంతవరకూ సక్సెస్ అయ్యారు?

Andhra Pradesh : భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ... ప్రజల అంచనాల్ని అందుకుందా? మాట తప్పం... మడమ తిప్పమని చెప్పే వైఎస్ జగన్... ఎంతవరకూ సక్సెస్ అయ్యారు?

Andhra Pradesh : భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ... ప్రజల అంచనాల్ని అందుకుందా? మాట తప్పం... మడమ తిప్పమని చెప్పే వైఎస్ జగన్... ఎంతవరకూ సక్సెస్ అయ్యారు?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకంగా 151 సీట్లు గెలుచుకొని... భారీ అంచనాలతో... మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తొలి రోజే... పెన్షన్‌ను రూ.2000 నుంచీ రూ.2250 రూపాయలకు పెంచుతూ... తొలి సంతకం పెట్టారు. ఆ తర్వాత అవినీతి అన్నదే ఉండకూడదని చాలాసార్లు బలంగా చెప్పిన జగన్... తీసుకునే నిర్ణయాల్లోనూ అదే పంథా కొనసాగించారు. ముఖ్యంగా కృష్ణా నది కరకట్టపై అక్రమ కట్టడాల విషయంలో జగన్ రాజీ లేని నిర్ణయాలు తీసుకున్నారు. ఇదివరకు టీడీపీ ప్రభుత్వం... ఆఫీసుగా వాడుకున్న ప్రజా వేదికను అక్రమ కట్టడంగా పరిగణిస్తూ... కూల్చివేయాలని నిర్ణయం తీసుకోవడంతోనే... టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ రగడ మొదలైంది. వైసీపీకి ఆరు నెలల గడువు ఇస్తామన్న టీడీపీ... మొదటి నెల నుంచే విమర్శల దాడికి దిగింది.

ప్రజా వేదిక తర్వాత... జగన్ తీసుకున్న మరో వివాదాస్పద నిర్ణయం పోలవరంపై రివర్స్ టెండరింగ్. గత టీడీపీ ప్రభుత్వం పోలవరం విషయంలో నిబంధనలను పక్కన పెట్టి... అక్రమాలకు పాల్పడిందంటూ... రివర్స్ టెండరింగ్‌కి పిలుపిచ్చారు వైఎస్ జగన్. ఐతే... దీనిపై నవయుగ కంపెనీ... హైకోర్టుకు వెళ్లడం... హైకోర్టు తీర్పు నవయుగ కంపెనీకి అనుకూలంగా రావడంతో... జగన్ సర్కారుకు తొలిదెబ్బ తగిలినట్లైంది. దీనిపై న్యాయపరంగా తేల్చుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా... ఈ వివాదం వల్ల పోలవరం నిర్మాణ పనులకు అంతరాయం కలుగుతోంది. దీనిపైనా విమర్శలు ఎక్కుపెట్టిన టీడీపీ... వైసీపీది రివర్స్ పాలన అంటూ సెటైర్లు వేసింది.

ఏపీ ప్రభుత్వానికి ఎదురవుతున్న మరో సవాలు రాజధాని అంశం. అమరావతిలో ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయనీ, అక్కడ నిర్మాణాలు చేపడితే... డబుల్ ఖర్చు అవుతుందని బొత్స లాంటి వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లతో... రాజధాని అమరావతి అంశం తీవ్ర కలకలం రేపుతోంది. తమకు అన్యాయం చెయ్యవద్దని అమరావతి ప్రాంత రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఏకంగా సీఎంనే అడ్డుకుని, వ్యతిరేక నినాదాలు చేసే పరిస్థితి వచ్చేసింది. రాజకీయంగా రాజధాని అంశంపై టీడీపీతో పాటు బీజేపీ, జనసేన ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య రేపు (గురువారం) CRDA అధికారులతో జగన్ సమావేశం కాబోతున్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదాన్నిబట్టీ... రాజధాని అంశంపై విపక్షాలు నెక్ట్స్ స్టెప్ వేసే అవకాశాలున్నాయి.

ఇక 90 రోజుల పాలనలో జగన్... ప్రజలు ఆయనపై పెట్టుకున్న అంచనాల్ని కొంతవరకూ అందుకోగలిగినా... ఇంకా పూర్తిస్థాయి సంతృప్తి కలిగించలేకపోయారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. పాలనపై అనుభవం లేకపోవడం కూడా ఒకింత సమస్య అయ్యిందంటున్నారు. కేంద్రం - ఏపీ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు చెప్పుకోతగ్గ విధంగా లేవు. గత టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల విషయంలో ఏపీ ప్రభుత్వానికీ, కేంద్రానికీ మధ్య పెద్ద వివాదమే నడిచింది. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తెచ్చినా... సెప్టెంబర్‌లో వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు ఇంటింటికీ పంపే అవకాశం కలగలేదు. ఇందుకు క్షేత్రస్థాయిలో చాలా సవాళ్లుండటమే కారణం. ఇక నవరత్నాల విషయంలో జగన్... ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వెళ్తున్నారు. మద్య నిషేధం విషయంలోనూ... చెప్పిన మాటకు కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ప్రధానంగా ఏపీ సర్కారుకు నిధుల కొరత వేధిస్తోంది. రాజధాని వివాదం వల్ల... రియల్ ఎస్టేట్ పడిపోవడం ప్రభుత్వానికి ప్రధాన సమస్యగా మారింది. కేంద్రం నుంచీ అనుకున్న స్థాయిలో నిధులు రాకపోవడం, రాష్ట్రంలో నిధులకు సరైన వనరులు లేకపోవడం వంటివి... పాలనను ముందుకు సాగనివ్వకుండా అడ్డుకుంటున్నాయి. మరోవైపు... ప్రతీ అంశంలోనూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ... విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య పాలనపై పట్టు నిలుపుకుంటూ... ప్రజాభిమానాన్ని పొందేందుకు ప్రయత్నించడం జగన్ ముందున్న అసలు సవాలు అనుకోవచ్చు.

First published:

Tags: Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu

ఉత్తమ కథలు