మందు బాబులకు సీఎం జగన్ గొప్ప సలహా..

లాక్‌డౌన్ దెబ్బకు వైన్ షాపులన్నీ మూతపడ్డాయి. ఒక్కసారిగా మందుబాబులకు ఎటూ పాలుపోలేని స్థితి ఏర్పడింది. అయితే, వీరికి ఏపీ ప్రభుత్వం మంచి సలహాలు ఇచ్చింది.

news18-telugu
Updated: April 13, 2020, 10:52 AM IST
మందు బాబులకు సీఎం జగన్ గొప్ప సలహా..
క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.
  • Share this:
లాక్‌డౌన్ దెబ్బకు వైన్ షాపులన్నీ మూతపడ్డాయి. ఒక్కసారిగా మందుబాబులకు ఎటూ పాలుపోలేని స్థితి ఏర్పడింది. అయితే, వీరికి ఏపీ ప్రభుత్వం మంచి సలహాలు ఇచ్చింది. ఇప్పటికే మద్యపాన నిషేధం దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. మరింత ముందడుగేసి లాక్‌డౌన్‌ను అందుకు వేదికగా మలచుకోవాలని చూస్తోంది. మద్యపాన గ్రస్తులకు ముఖ్య సూచనలు అంటూ మంచి దారిని చూపింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఏం చెప్పిందంటే.. మందు దొరక్కపోవడంతో మందుబాబులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుండె దడ, శ్వాస సమస్యలు, కాళ్లు చేతుల వణుకు, రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పిన ప్రభుత్వం.. ఆ సమస్యల నుంచి స్వస్తి పొందేందుకు ఏం చేయాలో చెప్పింది.

మానసిక సమస్యలు తలెత్తినప్పుడు ఎక్కువ సేపు సినిమాలు చూడాలని, టీవీ చూడాలని, కుటుంబంతో గడపాలని, ఎక్కువగా పిల్లలతో కాలక్షేపం చేయాలని సూచించింది. తోట పని చేయడం, వ్యాయామం, తరచూ నీళ్లు తాగడం, 8 నుంచి 9 గంటల నిద్ర పోవడం వల్ల మానసిక సమస్యలు దూరం అవుతాయని వెల్లడించింది. శారీరక సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని తెలిపింది.

మందుబాబులకు ఏపీ ప్రభుత్వ సలహాలు


మందు మానేయాలనుకునే వాళ్లకు లాక్‌డౌన్ ఒక వరమని, కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండేందుకు లిక్కర్‌కు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంతో ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 13, 2020, 10:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading