కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం..!

కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేపట్టవచ్చని, ఆ లోగా ఫ్రీజింగ్‌ గడువు కూడా తీరిపోతుందని ఉన్నతాధికార వర్గాలు రెవెన్యూశాఖకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాల ఏర్పాటుపై ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం.

news18-telugu
Updated: July 15, 2020, 7:34 AM IST
కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం..!
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కరసత్తులు జరుగుతున్నాయి. కొత్త జిల్లా ఏర్పాటుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను బుధవారం జరిగే కేబినెట్ సమావేశం ముందుకు రెవిన్యూ శాఖ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అనంతరం మంత్రివర్గంలో చర్చించి.. కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తామని ఎన్నికల ప్రచారంలోనే వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయడంపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా 12 కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కొంత కసరత్తులు చేపట్టిన ప్రభుత్వానికి.. జిల్లాల నుంచి ప్రతిపాదనలు పలు ప్రతిపాదనలు వచ్చాయి. ఐతే ప్రభుత్వం అనుకున్న దాని కంటే రెండు జిల్లాలు అదనంగా వస్తున్నట్లు సమాచారం. 2 గిరిజన జిల్లాల ఏర్పాటుకు డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. దాంతో మొత్తం ప్రతిపాదిత జిల్లాల సంఖ్య 27కి చేరినట్లు తెలుస్తోంది.

గిరిజిన జిల్లాలపై స్పష్టత లేకపోవడంతో వాటిని పక్కనబెట్టారు. ఐతే ఈలోగా జనాభా గణన ప్రక్రియ తెరపైకి రావడంతో.. కేంద్రం ఫ్రీజింగ్ ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల సరిహద్దులు మార్చడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అవరోధం ఏర్పడింది. ఐతే కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేపట్టవచ్చని, ఆ లోగా ఫ్రీజింగ్‌ గడువు కూడా తీరిపోతుందని ఉన్నతాధికార వర్గాలు రెవెన్యూశాఖకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాల ఏర్పాటుపై ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం.

మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాలుగా జిల్లాలను విభజిస్తే సమస్యలు వస్తాయని అధికార పార్టీకి చెందిన నేతలే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త జిల్లాల డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Published by: Shiva Kumar Addula
First published: July 15, 2020, 7:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading