వైఎస్ వివేకానందరెడ్డికి వైఎస్ విజయమ్మ నివాళులు

YS Vivekananda Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా... ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనకు నివాళులు అర్పించారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 8, 2019, 11:01 AM IST
వైఎస్ వివేకానందరెడ్డికి వైఎస్ విజయమ్మ నివాళులు
నివాళులు అర్పిస్తున్న వైఎస్ కుటుంబ సభ్యులు
  • Share this:
మాజీ మంత్రి వైయ‌స్‌ వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా... కడప జిల్లా... పులివెందుల‌లోని వివేకా ఘాట్ దగ్గర నివాళుల‌ు అర్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ. వివేకానంద‌రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, ఇతర కుటుంబ సభ్యులు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వివేకానంద రెడ్డితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా లీలావతి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని పులివెందులలో నిర్వహిస్తారు. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై రక్తదానం చేస్తున్నారు. నిజానికి నేటి ఉదయం 8 గంటలకు సీఎం వైఎస్ జగన్... వివేకానంద రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఆకస్మిక మరణంతో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఒక రోజు అదనంగా జరుగుతోంది. నేటి మధ్యాహ్నం వరకూ ఈ పర్యటన సాగనుంది. అందువల్ల విగ్రహావిష్కరణ వైఎస్సార్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 2న చేయనున్నారు.

నివాళులు అర్పిస్తున్న వైఎస్ కుటుంబ సభ్యులు


మాజీ ఎంపీ అయిన వివేకానంద రెడ్డిని మార్చి 15, 2019న పులివెందులలోని ఆయన ఇంట్లోనే హత్య చేశారు దుండగులు. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. హంతకులు ఎవరు ? హత్యకు కారణం ఏంటి? అన్నది సిట్ ఇప్పటివరకూ కనిపెట్టలేకపోయింది. ఎన్నికలకు ముందు హత్య జరిగినా... అది మిస్టరీగానే మిగిలిపోయింది. హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వివేకా ముఖ్య అనుచరుడైన గంగిరెడ్డికి, వాచ్ మ్యాన్ రంగయ్యకు, కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ పరీక్షలు జరిపారు. వాళ్లతోపాటూ మరో నిందితుడు కసునూరి పరమేశ్వర్ రెడ్డిని మార్చిలో అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఎలాంటి పురోగతీ కనిపించలేదు.

First published: August 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...