హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Bharati: సీఎంగా జగన్ భార్య భారతి.. ఏపీ బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

YS Bharati: సీఎంగా జగన్ భార్య భారతి.. ఏపీ బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

భర్త సీఎం జగన్‌తో భారతి( ఫైల్ ఫోటో)

భర్త సీఎం జగన్‌తో భారతి( ఫైల్ ఫోటో)

Andhra Pradesh: రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని జగన్ చెప్పారని గుర్తు చేసిన విష్ణుకుమార్ రాజు... రెండున్నరేళ్ల తర్వాత ఏపీ సీఎం కూడా మారిపోవచ్చని వ్యాఖ్యానించారు.

  సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ప్రజల కష్టాలు తెలియడం లేదని విమర్శించారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని జగన్ చెప్పారని గుర్తు చేసిన విష్ణుకుమార్ రాజు... రెండున్నరేళ్ల తర్వాత ఏపీ సీఎం కూడా మారిపోవచ్చని వ్యాఖ్యానించారు. ఉపముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే..ఏపీకి మొట్టమొదటి మహిళా సీఎంని చేసి జగన్ చరిత్ర సృష్టించాలని కోరారు. . జగన్ సతీమణి భారతి తదుపరి సీఎం అయితే ప్రజలు సంతోషిస్తారని వ్యాఖ్యానించారు. వైఎస్ భారతి ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తెలుసుకొని న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

  ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్‌తో జగన్‌ను పోలుస్తూ విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు. ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి అని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని... అక్రమాలు జరిగినందున ఏకగ్రీవాలను రద్దు చేయాలని విష్ణుకుమార్‌ రాజు డిమాండ్ చేశారు.

  Bjp leader comments on ys bharati, ys bharati ap cm, Vishnu kumar raju, ap cm ys jagan, ap news, వైఎస్ భారతిపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు, విష్ణుకుమార్ రాజు, ఏపీ సీఎం జగన్, ఏపీ న్యూస్
  బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు( ఫైల్ ఫోటో)

  విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ బలం పుంజుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలోనే సంస్థాగతంగా కీలక మార్పులు చేపడుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీలో ముఖ్యమైన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించారు. మొత్తం 70 మందితో భారీ కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ సీటును జిల్లా యూనిట్‌గా తీసుకుని నియామకాలు చేపట్టారు. కొన్ని చోట్ల ఎక్కువ మందికి ప్రాధాన్యం దక్కింది. మరికొన్ని చోట్ల ఒక్కో పార్లమెంట్‌కు ఒక్కరు, ఇద్దరినే నియమించారు. మొత్తం 70 మంది ఉన్న కమిటీలో 21 మంది మహిళలకు చోటు దక్కింది. అన్ని సామాజికవర్గాల వారికి ప్రాధాన్యం కల్పించారు. జిల్లాల వారీగా ఉన్న సామాజికవర్గాల సమీకరణాలను బేరీజు వేసుకుని నియామకాలు చేపట్టారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నుంచి కందుల రాజమోహన్ రెడ్డి, డి.హరికృష్ణ, బాలకృష్ణ యాదవ్, సుష్మకు చోటు దక్కింది. అలాగే, హిందూపూర్ నుంచి గోరంట్ల మోహన్ శేఖర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిత్తూరు నుంచి సుబ్రమణ్యం యాదవ్, గాలి పుష్పలతకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం కల్పించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ys bharathi

  ఉత్తమ కథలు