హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Bird Lovers: వీళ్లు నిజమైన ప్రకృతి ప్రేమికులు... పక్షుల కోసం వినూత్న కార్యక్రమం..

Bird Lovers: వీళ్లు నిజమైన ప్రకృతి ప్రేమికులు... పక్షుల కోసం వినూత్న కార్యక్రమం..

అనంతపురంలో పక్షుల కోసం గూళ్లు ఏర్పాటు చేస్తున్న యువకులు

అనంతపురంలో పక్షుల కోసం గూళ్లు ఏర్పాటు చేస్తున్న యువకులు

సమాజంలో పల్లెల నుంచి పట్టణాల వరకు పక్షుగా కిలకిలలు అస్సలు కనపడటం లేదు. అంతరించి పోతున్న పక్షులను కాపాడేందుకు వినూత్న ప్రయోగం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం (Anantapuram) వాసులు.

GT Hemanth Kumar, Tirupathi, News18

పక్షులు తమ కిలకిలరావాలతో మనకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అంతేకాదు మనిషి హాయిగా బ్రతకాలన్నా.. ప్రకృతిని సమతౌల్యంగా ఉండాలన్నా పక్షులు చాలా కీలకం. ఒకరకంగా చెప్పాలంటే పక్షులు లేకుంటే మానవుల మనుగడ కష్టమే. అందుకే వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. పక్షుల సంరక్షణ అంటే మనకు టక్కున రోబో-2 సినిమాలో పక్షి రాజా పాత్ర గుర్తొస్తుంది. పక్షుల సంరక్షణ కోసం అందులో పక్షిరాజా ఎంతగానో ప్రయత్నాలు సాగిస్తాడు. అది సినిమా... నిజ జీవితంలోను ప్రకృతి, పక్షుల ప్రేమికులు ఉన్నారు. ప్రస్తుతం నవ సమాజంలో పల్లెల నుంచి పట్టణాల వరకు పక్షుగా కిలకిలలు అస్సలు కనపడటం లేదు. అంతరించి పోతున్న పక్షులను కాపాడేందుకు వినూత్న ప్రయోగం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం (Anantapuram) వాసులు.

నేటి సమాజంలో పట్టణాలు., పల్లెలో చాల అరుదుగా పక్షులు కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం.., వాటికి సరైన ఆవాసం లేకపోవడమే కాకుండా వాటి జీవనానికి కావాల్సిన ఆహారంఅంధక పోవడమే. ఇప్పటికే పక్షుల్లో కొన్ని జాతులు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి. ఇవన్నీ చూసిన కొందరు యువకులు మొక్కలను పెంచేందుకు ప్రయత్నం చేస్తూనే చెట్లపై పక్షుల కోసం ప్రత్యేకించి గుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. యువతరం ఒక్కడుగు పక్షుల సంరక్షణార్థం హోమ్ ఫర్ బర్డ్స్ (home for Birds) అనే కార్యక్రమాన్ని చేపట్టారు. యువకుల తపన చూసిన అనిల్ కుమార్ యువతను ప్రోత్సహించడమే కాకుండా హోమ్ ఫర్ బర్డ్స్ అనే సొసైటీని ప్రారంభించారు. ఆసక్తి గల యువతకు ఆహ్వానం అందిస్తూ ప్రతి ఒక్కరు ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేయాలనీ పిలుపునిస్తున్నారు సొసైటీ సభ్యులు.

ఇది చదవండి: వేరే మహిళతో భర్త ఎఫైర్.. భార్య చేసిన పనికి పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయ్..


దీనిపై అనిల్ మాట్లాడతూ "నా చిన్ననాటి సమయంలో మా ఇంటి చుట్టూ ఎన్నో పక్షులు ఉండేవి. వాటిని చూసి చిన్నపుడు కేరింతలు కొట్టే వాడిని. ప్రస్తుతం ఏ సిటీలో చూసిన రివ్వున ఎగురుకుంటూ వచ్చే పక్షుల సంఖ్యా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అసలు ఎందుకు పక్షులు తగ్గుముఖం పడుతున్నాయని ఆలోచిస్తే.., వాటికీ కావాల్సిన ఆహారం, ఆవాసం లేకపోవడమే. గ్రీన్ అనంతపురం దీక్షలో భాగంగా ప్రతి పక్షికి గుళ్ళు అనే కార్యక్రమాన్ని మొదలెట్టాం. చెట్లు నరికేయడం వల్ల మళ్లీ గూళ్ళు ఏర్పాటు చేసుకోలేక చాల పక్షులు చనిపోతున్నాయి. దీంతో అనంతపురం పట్టణంకు 6 కిలోమీటర్ల పరిధిలో ప్రతి ఇంటికి పక్షి గుళ్ళు ఏర్పాటు చేస్తున్నాం. వాటిని పక్షులు ఎలా తాయారు చేసుకుంటాయి ప్రకృతి సిద్ధంగా అలానే తాయారు చేసి ఇస్తున్నాం" అంటూ హోమ్ ఫర్ బర్డ్స్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ న్యూస్18 కి తెలిపారు.

ఇది చదవండి: పీఆర్సీపై చల్లారని మంటలు.. సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులు..


మొదట ఈ బృందం ఆహారం., నీళ్లు లేని పక్షులకు నీటిని, ఆహారాన్ని అందించాలనే ప్రయత్నం చేశారు. కానీ చాల పక్షులకు గూళ్లు లేక పోవడంతో పావురాలు, డేగలు చిన్న చిన్న పక్షులపై దాడులు చేస్తున్నాయి. వాటి ఆవాసానికి గూళ్లను తయారూ చేయాలనీ నిర్ణయించుకున్నారు. పక్షులు ఎలాగైతే సహజ సిద్ధంగా తయారు చేసుకుంటాయో అలానే గుళ్లను తాయారు చేసే ప్రయత్నం చేశారు. గూగుల్ లో వెతికి ఈ రకంగా పక్షుల గూళ్లను తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నారు. ఏ పక్షి ఏరకమైన గూడు నిర్మించుకుంటుందన్న విషయంపై శోధన చేసి పక్షి గూళ్లను కోయంబత్తూరు నుంచి తెప్పించుకున్నారు.

ఇది చదవండి: ఫ్లైట్ లో తిరుపతికి వెళ్తున్నారా..? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..! శ్రమలేకుండానే శ్రీవారి దర్శనం..


ఇందుకు ఓ బృందంగా ఏర్పడి అనంతపురం నగరంలో ఎన్ని జాతుల పక్షులు ఉన్నాయని తొలుత సర్వే నిర్వహించారు.వారివద్ద ఉన్న సమాచారం అందరంగా వివిధ విశ్వవిద్యాలల్లో ఆర్నథాలజీ నిపుణులతో మాట్లాడారు. ఏ పక్షి ఎలాంటి గూడు కట్టుకట్టుకుంటుంది, అన్ని పక్షులకు సరిపోయేలా గూళ్లు తయారు చేయడం ఎలా..? వంటివి అడిగి తెలుసుకున్నారు. అధ్యయనం తర్వాత 4 రకాల పక్షి గూళ్లు తయారు చేయిస్తున్నారు.

ఇది చదవండి: ఏపీలో కరోనా టెస్టుల ధర తగ్గింపు.. కొత్త ధర ఎంతంటే..!


ప్రస్తుతం ప్రతి ఆదివారం 2500 పక్షి గూళ్లను వితరణ చేస్తున్నారు. అనంతరపురంకు 6కిలోమీటర్ల పరిధిలో ఇళ్లు, స్కూల్స్, కార్యాలయాలు, పార్కులు వంటి ప్రదేశాల్లో అక్కడకు వచ్చే పక్షులను బట్టి గూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సోషిల్ మీడియాలో విపరీతమైన ప్రచారం రావడంతో చాలమంది పక్షి ప్రేమికులు పక్షి గూళ్ల కోసం వీరిని సంప్రదిస్తున్నారు. ప్రారంభ సమయంలో నెలకు 2500 గూళ్లను పంపిణి చేస్తే చాలు అనుకున్నారు. భారీ స్పందన రావడంతో వారానికి 6వేల గూళ్లు పంపిణీ చేసేస్థాయికి వచ్చారు. కాలేజీల్లో చదువుకునే యువకులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు.


ఇది చదవండి: కళకోల్పోయిన శిల్పారామం.., కొవిడ్ దెబ్బకు ఆదాయానికి గండి..

తెల్లవారక ముందు, సాయంత్రం పక్షులు తిరిగి నగరానికి వచ్చే సమయానికి వీధుల్లో సర్వే చేయటానికి వెళతారు. రోజూ ఒక కాలనీని ఎంపిక చేసుకొని పక్షలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయని స్థానికంగా విచారణ చేస్తారు. చెట్లు తక్కువ ఉన్న కాలనీల్లో మొక్కలు నాటటంతో పాటు, ఇంటి యజమానుల్ని ఒప్పించి గృహాల ఆవరణలో పక్షి గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం గూళ్లను మాత్రం ఏర్పాటు చేస్తున్న హోమ్ ఫర్ బర్డ్స్ సొసైటీ త్వరలోనే నీరు, ఆహారం అందించే ప్రయత్నం చేయనుంది. వీరు చేస్తున్న ప్రయత్నం పర్యావరణ పరీక్షణ, భావితరాలకు అంతరించి పోతున్న పక్షి జాతులను భావితరాలకు అందించే ప్రయత్నం చూసి శభాష్ అనకుండా ఉండలేము.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Birds

ఉత్తమ కథలు