స్పందన కార్యక్రమంలో యువకుడు ఆత్మహత్యాయత్నం.. పెట్రోల్ పోసుకొని..

స్పందన కార్యక్రమంలో యువకుడు ఆత్మహత్యాయత్నం.. పెట్రోల్ పోసుకొని..

ప్రతీకాత్మక చిత్రం

ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ తీవ్ర అలజడి ఏర్పడింది. స్థానికులు, పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది.

  • Share this:
    విజయనగరం కలెక్టరేట్ వద్ద కలకలం రేగింది. స్పందన కార్యక్రమం సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ తీవ్ర అలజడి ఏర్పడింది. స్థానికులు, పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడి స్వస్థలం బొబ్బిలి మండలం పోరాది గ్రామం. పేరు ఇస్మాయిల్. గతంలో అతడికి ఇల్లు మంజూరైంది. ఐతే ఇప్పుడు కొత్త జాబితాలపై తన పేరు లేకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐనా వారు స్పందించడం లేదని.. వైసీపీ నేతలు చెప్పిన వారికే ప్రభుత్వ పథకాల ఫలాలు అందుతున్నాయని ఆరోపించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: