• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • YOUTH ATTACKED ON SI FOR OBJECTING OVER SPEED IN VIZIANAGARAM DISTRICT OF ANDHRA PRADESH PRN

Andhra Pradesh: ఎస్సైపై యువకుల దాడి.., స్పీడ్ గా వెళ్లొద్దనందుకు ఎటాక్

Andhra Pradesh: ఎస్సైపై యువకుల దాడి.., స్పీడ్ గా వెళ్లొద్దనందుకు ఎటాక్

ఎస్సైపై దాడి చేస్తున్న యువకులు

పోలీసులంటే సమాజంలో శాంతిభద్రతలను రక్షిస్తారు. ఎవరైనా చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటారు. ఎవరైనా పొరబాటు చేస్తే సరిదిద్దుతారు.

  • Share this:
    పోలీసులంటే సమాజంలో శాంతిభద్రతలను రక్షిస్తారు. ఎవరైనా చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటారు. ఎవరైనా పొరబాటు చేస్తే సరిదిద్దుతారు. ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ విషయంలో వారు పక్కాగా ఉంటారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటుంటారు. ప్రమాదకరంగా వాహనాలను నడిపితే అక్కడిక్కకడే అడ్డుకొని ఫైన్ విధించడమే.., జాగ్రత్త చెప్పి పంపించడమో చేస్తుంటారు. బైక్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న యువకులను అడ్డుకున్న పాపానికి ముగ్గురు యువకులు ఎస్సైపై దాడికి యత్నించారు. అంతేకాదు నడిరోడ్డుపై తీవ్రంగా కొట్టారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా పాచిపెంట ఎస్సై రమణ.., శివన్నపేటలోని అత్తగారింటికి వెళ్లి తిరిగి సివిల్ డ్రెస్ లో బయలుదేరారు. ఈ క్రమంలో ఖడ్గవలస బైక్ పై వేగంగా వెళ్తున్న సుధాకర్ చంద్రశేఖర్ అనే యువకులను ఆయన అడ్డుకున్నారు.

    స్పీడ్ గా వెళ్లొద్దని వారించినందుకు ఆయనపై దాడి చేశారు. వారిదగ్గర ఉన్న హెల్మెట్ తో విచక్షణారహితంగా కొట్టారు. ఎస్సై షర్టు చించేసి రక్తమొచ్చేలా కొట్టారు. స్థానికులు అడ్డుకున్నా వినిపించుకోని యువకులు., మరింత రెచ్చిపోయారు. యువకులు దాడి చేసిన ఘటనను స్థానికులు రికార్డ్ చేశారు. చంద్రశేఖర్, సుధాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై రౌడీషీట్ తెరుస్తామని వెల్లడించారు. ఎస్సై రమణ బైక్ ను స్పీడ్ గా వెళ్తూ క్రాస్ చేసిన యువకులు మార్గమధ్యలో ఒకర్ని ఢీ కొట్టబోయినట్లు తెలిసింది. నడిరొడ్డుపై ఎస్సైని కొడుతున్నా ఒక్కరు కూడా అడ్డుకోలేదు. పైగా వినోదం చూశారు.

    ఎస్సై రమణ యూనిఫామ్ లో లేకపోవడంతోనే యువకులిద్దరు ఆయనపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఐతే రోడ్డుపై జాగ్రత్తగా వెళ్లమని చెప్తే ఎవర్నైనా కొట్టేస్తారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నడిరోడ్డుపై పోలీసులపైనే దాడి చేస్తే సామాన్య జనం పరిస్థితేంటని అంటున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు