వైసీపీ ఎంపీ పేరుతో దందాలు... మంగళగిరిలో కలకలం

స్కార్పియో వాహనంపై ఎంపీ సురేశ్ పేరుతో ఉన్న స్టిక్కర్

కొద్దిరోజులుగా ఎంపీ నందిగం సురేశ్ ఎంపీ స్టిక్కర్‌ వేసిన స్కార్పియో వాహనంలో కొందరు యువకులు హల్‌చల్ చేస్తున్నారు.

  • Share this:
    తన పేరుతో దందాలు చేస్తున్న కొందరు యువకులను బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ మందలించారు. కొద్దిరోజులుగా ఎంపీ నందిగం సురేశ్ ఎంపీ స్టిక్కర్‌ వేసిన స్కార్పియో వాహనంలో కొందరు యువకులు హల్‌చల్ చేస్తున్నారు. ఆయన పేరుతో 15 రోజులుగా దందాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ల్యాండ్ వివాదం చర్చించేందుకు ఎంపీ సురేశ్ పేరును యువకులు వినియోగించుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న ఎంపీ నందిగం సురేష్ స్వయంగా రంగంలోకి దిగారు. తన పేరు చెప్పుకుని ఇలాంటి పనులు చేస్తున్న యువకులను ఆయన గట్టిగా మందలించారు. తన పేరు ఉన్న స్టిక్కర్‌ను తొలిగించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: