M BalaKrishna, Hyderabad, News18
సాధారణం ప్రతి మనిషికి ఇష్టాలు, అభిరుచులుంటాయి. కొన్ని కారణాల వల్ల వాటిని నెరవేర్చుకోలేకపోతారు. చాలామంది మొక్కలు పెంచాలి, పెరిటి తోటలతో కాలక్షేపం చేయాలని భావిస్తుంటారు. కానీ కాంక్రీట్ జంగిల్ అలాంటి అవకాశం లేక అసంతృప్తితో ఉంటారు. కానీ ఓ యువకుడు మాత్రం అడ్డంకులను అధిగమించి.. తన అభిరుచితో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఏకంగా తన ఇంటిని అరుదైన మొక్కలకు అడ్డాగా మార్చాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) మచిలీప్నంకు చందిన మణిరత్నం.. చార్టెడ్ ఎకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. మణికి చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, కానీ దానికి సమయంతోపాటు స్థలం కూడా దొరకలేదు. ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి పొలం కొని పండిచే స్తోమత లేకపోవడంతో తన ఇంటి పై కప్పునే వ్యవసాయ పొలంగా మార్చేశాడు.
2018లో ఒక రూఫ్‌టాప్ గార్డెన్తో చిన్నగా ప్రారంభించాడు అతని ప్రయాణం మూడు సంవత్సరాలలో తన టెర్రస్‌పై 50 కంటే ఎక్కువ రకాల ఔషధ మొక్కలు, పండ్లు, కూరగాయలను పెంచుతున్నాడు. అంతేకాదు, ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండానే వీటిని పెంచడం ఇక్కడ విశేషం. మణి తనలాగే వ్యవసాయం చేయాలని ఆసక్తి ఉన్న మరికొందరిని ఒక గ్రూపుగా ఏర్పాటు చేశారు. బందర్ బృందావనం అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా తనలా ఆసక్తి ఉన్న వాళ్ల ఆలోచనలు కొత్త విషయాలు, కొత్త రకం పళ్లు దిగుమతి వంటి అంశాలను ఇందులో చర్చించుకుంటారు.
ఇప్పటికే ఈ పేజీలో దాదాపు ఐదు వేలకు పైగా సభ్యులుగా ఉన్నారు. మణి, ఈ గ్రూప్ ద్వారా ఇలా వ్యవసాయం చేయలానే ఆసక్తి ఉన్నవాళ్లు ఒకరికొకరు కనెక్ట్ అవ్వడం, విత్తనాలు, మొక్కల గురించ, చిట్కాలు వంటివి చేస్తోంటారు. ప్రస్తుతం మణీ నిర్వహిస్తోన్న బృందావంలో బ్రహ్మకమలం, అవకాడో, యాపిల్, పియర్, డ్రాగన్ ఫ్రూట్, వాటర్ యాపిల్, అరటి పండు నుండి ద్రాక్ష వరకు, అన్ని రకాల పళ్లు, పూలు పెంచుతున్నారు.
తన టెర్రెస్ గార్డెన్ గురించి మణిరత్నం మాట్లాడుతూ... “చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం చేయడమంటే చాలా ఇష్టం. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగరిత్యా ఇక్కడ స్థిరపడాల్సి వచ్చింది. అయిన నాలో ఉన్న కోరిక అలానే ఉండిపోయింది. దీంతో ఇంటిపైనే ఎందుకు నేను అనుకున్న కోరుకున్న వ్యవయసాయం చేయకూడదు అని వచ్చిన ఐడియానే ఈ టెర్రస్ గార్డెన్.ప్రస్తుతం నేను అన్ని రకాల పళ్లు, పూలు ఇతర జౌషద మొక్కలను పెంచుతున్నాను. నాలా ఇలా మొక్కలను పెంచే ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు చాలా మంది ఉంటారు కదా అని 2018 లోనే బందరు బృందావనం అనే గ్రూపు ను ఫేస్ బుక్ లో ప్రాంరబించాను. ఈ గ్రూపు ద్వారా నేను మొక్కలను పెంచే విధానం తోపాటు అరుదైన జాతి మొక్కలను ఎలా పెంచాలనే వాటికి సంబంధించి చాలా విషయాలు నాలా ఆసక్తి ఉన్న వాళ్లకు అందించడంతోపాటు ఇతర సభ్యల నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను.” అని న్యూస్ 18 కి తెలిపారు
ఈ గ్రూపు ద్వారా మొక్కల పెంపకానికి సంబంధించి చాలా విషయాలను నేర్చుకుంటున్నారు గ్రూపు సభ్యులు. ఈ గ్రూపు సభ్యురాలైన మచిలిపట్నంకి చెందిన హేమ తన టెర్రస్ గార్డెన్ లో ద్రాక్ష, పొట్లకాయ, యాపిల్, అవకాడో, అరటి, పైన్ యాపిల్,వంటి అనేక రకాల కూరగాయాలు, ఆకు కూరలు, పూల మొక్కలను పెంచుతోంది. ఆమె పెంచే వివిధ రకాల మొక్కలను చూసేందుకు చాలా మంది నా టెర్రస్ గార్డెన్ చూడడానికి వస్తారని చెప్పారామె.మణిరత్నం ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్ చూడడానికి ఎవరైన వెళ్లోచ్చు. అక్కడ అరుదైన మొక్కలకు సంబంధించిన విత్తనాలు కూడా మణిరత్నం అందుబాటులో ఉంచుతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మచిలీపట్నంలో ఉన్న ఈ టెర్రస్ గార్డెన్ ఎవరైన సందర్శించోచ్చని చెప్పారాయన.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh