YOUNG WOMAN SUSPECT GANG RAPE IN PEELERU TOWN OF CHITTOOR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Lovers: ప్రియుడితో కలిసి షికారుకెళ్లిన యువతి.. ఏకాంతంగా ఉండగా నలుగురు ఎంట్రీ.. ఆ తర్వాత..
ప్రతీకాత్మక చిత్రం
Lovers: ప్రేమించిన వాడితో బయటికెళ్లిన యువతికి అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ఆమె జీవితం ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రేమికులెప్పుడూ ఏకాంతాన్ని కోరుకుంటారు. సరదాగా బయటికెళ్లి కబుర్లు చెప్పుకోవాలని భావిస్తుంటారు. ప్రేమించిన వాడితో ఊసులు చెప్పుకుంటూ బాసలు చేసుకుంటుంటారు. అలా ప్రేమించిన వాడితో బయటికెళ్లిన యువతికి అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ఆమె జీవితం ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor Ditrict)లో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే పీలేరులోని ఓ డిగ్రీ కాలేజీలో చదువుతున్న యువతి-యువకుడు ప్రేమించుకున్నారు. చాలాకాలంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. క్లాస్ మేట్స్ కావడంతో అప్పుడప్పుడు ఔటింగ్ కు వెళ్లి వచ్చేవారు. వారానికి రెండుమూడుసార్లు షికారుకెళ్లి సరదాగా గడిపి వచ్చేవారు. వారం రోజుల క్రితం పీలేరు శివారులోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటుండగా మద్యం తాగిన నలుగురు యువకులు అటువైపు వచ్చారు.
ప్రేమజంటకు తెలియకుండా వారి మొబైల్ ఫోన్లో వీడియోలు తీశారు వారిని గమనించిన ప్రేమికులు వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయేందుకు యత్నించారు. ఐతే వారిని అటకాయించిన మందుబాబులు బెదిరించారు. మేం చెప్పినట్లు చేయకుంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. ఇంతలో వారిలో ఒకడు.. వైన్ తీసుకొస్తే విడిచిపెడతామని ప్రియుడ్ని ఆదేశించాడు. దీంతో అతడు మద్యం తీసుకొచ్చేందుకు వెళ్లాడు.
యువకుడు అటు వెళ్లగానే.. మద్యం మత్తులో ఉన్న నలుగురు ఆమెతో అసభ్యంతా ప్రవర్తిస్తూ.. చివరికి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నారు. ఆ తర్వాత ప్రియుడి సాయంతో ఇంటికెళ్లిన యువతి.. వారం రోజుల తర్వాత మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణపాయం తప్పింది. ఆత్మహత్యాయత్నం సమాచారం అందుకున్న పోలీసులు యువతిని ప్రశ్నించగా జరిగిన దారుణాన్ని బయటపెట్టింది. ఐతే తల్లిదండ్రులు తమకు న్యాయం అవసరం లేదని.. వదిలేయమని కోరడంతో పోలీసులు రహస్యంగా విచారణ సాగిస్తునట్లు సమాచారం.
గతఏడాది జూన్ లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది. విజయవాడకు చెందిన బాధిత యువతి ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు ఇటీవలే ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. విధులు ముగించుకొని అతడితో కలిసి సీతానగరం పుష్కరఘాట్ కు వెళ్లింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. వీళ్లిద్దరినీ గమనించిన ఇద్దరు యువకులు.. వారిపై వెనుక నుంచి దాడి చేశారు. యువకుడి చేతులు కాళ్లు కట్టేసి... యువతిపై అత్యాతారం చేశారు. యువకుడు ఎదురుతిరగకుండా బ్లేడుతో బెదిరించారు. అనంతరం చెవి రింగులు, డబ్బులు, సెల్ ఫోన్ తీసుకొని ఓ నాటుపడవలో అక్కడి నుంచి పారిపోయారు. అప్పట్లో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.