YOUNG WOMAN SUSPECT DEATH IN WEST GODAVARI DISTRICT AS POLICE INVESTIGATION GOING ON FULL DETAILS HERE PRN
Shocking:రాత్రి రూమ్ లోకి వెళ్లి తలుపేసుకున్న యువతి.. తర్వాతి రోజు మధ్యాహ్నం షాకింగ్ దృశ్యం..
ప్రతీకాత్మకచిత్రం
Suspect Death: జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అప్పటివరకు అంతా బాగానే ఉంటుంది. క్షణాల్లోనే తలరాతలు మారిపోతాయి. నిన్నటివరకు కళ్లముందు తిరిగిన వారే ఉన్నట్లుండి జీవితాన్ని ముగిస్తారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి.
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అప్పటివరకు అంతా బాగానే ఉంటుంది. క్షణాల్లోనే తలరాతలు మారిపోతాయి. నిన్నటివరకు కళ్లముందు తిరిగిన వారే ఉన్నట్లుండి జీవితాన్ని ముగిస్తారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అప్పటివరకు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉన్న యువతి.. ఉన్నట్లుండి బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) పెంటపాడు మండలం అలంపురం గ్రామానికి చెందిన దేవళ్ల సత్యవతి కుమార్తె మేరీ ప్రసన్న కుమారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఈనెల 22న రాత్రి సమయంలో తన గదిలోకి వెళ్లి తలుపేసుకున్న ప్రసన్న ఎంతకీ తలుపు తీయలేదు. తర్వాతి రోజు మధ్యాహ్నం అయినా తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.
దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రసన్న మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రసన్న ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా..? లేక ప్రేమ వ్యవహారంతోనే సూసైడ్ చేసుకుందా అనేది తెలియలేదు. పోలీసులు కుటుంబ సభ్యులతో పాటు బంధువులను విచారిస్తున్నారు.
ఇటీవల విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నగరంలోని కప్పరాడ రాంజీ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన పావని డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేస్తోంది. మూడు నెలల క్రితం ఆమెకు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఫిబ్రవరి 2వ తేదీన పెళ్లి చేసేందుకు పెద్దలు ముహూర్తం కుదిర్చారు. మరో 10 రోజుల్లో పెళ్లి ఉండటంతో శుభలేఖలు ముద్రించి బంధువుకలకు పంచుతున్నారు. ఈ క్రమంలో పావని కూడా తన ఫ్రెండ్స్ కి శుభలేఖలిచ్చి పెళ్లికి రావాలని ఆహ్వానించింది.
ఈనెల 21వ తేదీన తండ్రి డ్యూటీకి వెళ్లగా.. తల్లి వేరే ఊళ్లో ఉన్న బంధువులకు శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లింది. తల్లి తిరిగొచ్చేసరికి ఇంటి గేటుకు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎంతసేపు పిలిచినా కూతురు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా పావని ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. స్థానికులు సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే మృతి చెందింది.
తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి ఇష్టం లేకనే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఐతే స్వయంగా తానే పెళ్లి శుభలేఖలు పంచి ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పదిరోజుల్లో పెళ్లి పెట్టుకొని కుమార్తె సూసైడ్ చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.