Home /News /andhra-pradesh /

YOUNG WOMAN SUSPECT DEATH BEFORE MARRIAGE IN VISAKHAPATNAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Shocking: పదిరోజుల్లో ఆమె పెళ్లి.. తానే శుభలేఖలు పంచింది.. కానీ ఇలా చేసిందేంటి..?

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Bride: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) కప్పరాడ రాంజీ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన పావని డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేస్తోంది. మూడు నెలల క్రితం ఆమెకు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది.

ఇంకా చదవండి ...
  ఆమెను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. బాగా చదివించారు. పెళ్లీడు రావడంతో ఓ యువకుడితో సంబంధం కుదిర్చారు. నిశ్చితార్థం జరిగిపోయింది. శుభలేఖలు కూడా పంచేశారు. 10రోజుల్లో పెళ్లనగా యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) కప్పరాడ రాంజీ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన పావని డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చేస్తోంది. మూడు నెలల క్రితం ఆమెకు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఫిబ్రవరి 2వ తేదీన పెళ్లి చేసేందుకు పెద్దలు ముహూర్తం కుదిర్చారు. మరో 10 రోజుల్లో పెళ్లి ఉండటంతో శుభలేఖలు ముద్రించి బంధువుకలకు పంచుతున్నారు. ఈ క్రమంలో పావని కూడా తన ఫ్రెండ్స్ కి శుభలేఖలిచ్చి పెళ్లికి రావాలని ఆహ్వానించింది.

  ఈనెల 21వ తేదీన తండ్రి డ్యూటీకి వెళ్లగా.. తల్లి వేరే ఊళ్లో ఉన్న బంధువులకు శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లింది. తల్లి తిరిగొచ్చేసరికి ఇంటి గేటుకు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎంతసేపు పిలిచినా కూతురు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా పావని ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. స్థానికులు సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే మృతి చెందింది.

  ఇది చదవండి: ఎనిమిదేళ్లుగా సహజీవనం.. ప్రియురాలిపై అనుమానం.. సంబంధం లేని వ్యక్తులు బలి..


  తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి ఇష్టం లేకనే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఐతే స్వయంగా తానే పెళ్లి శుభలేఖలు పంచి ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పదిరోజుల్లో పెళ్లి పెట్టుకొని కుమార్తె సూసైడ్ చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

  ఇది చదవండి: మూడు నెలల క్రితమే పెళ్లి.. మంచి ఉద్యోగం.. కానీ ఇంతలోనే అలా చేస్తుందనుకోలేదు..


  లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం పడమరకు చెందిన జక్కంశెట్టి ధర్మారావు, తులసి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అశ్వని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. మూడు నెలల క్రితం ఆమెకు భీమవరం మండలం దిరుసుమర్రుకు చెందిన వెండ్ర రామకృష్ణతో పెళ్లైంది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఆమె.. సంక్రాంతికి భర్తతో కలిసి పుట్టిల్లైన కాళీపట్నం వచ్చింది. పండగ తర్వాత భర్త రామకృష్ణ హైదరాబాద్ వెళ్లిపోయాడు.

  ఇది చదవండి: భార్యను ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఆ తర్వాత ఉంది అసలు ట్విస్ట్..


  ఈ క్రమంలో  ఈనెల 20న అర్ధరాత్రి తన బైక్ పై ఒంటరిగా ముత్యాలపల్లివైపు వెళ్లిన అశ్విని.. వంతెన వద్ద బైక్, తన వస్తువులను ఉంచి ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అశ్వినీ ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఉప్పుటేరు వద్ద ఆమె స్కూటీ ఉండటం చూసి అందులో గాలించగా మృతదేహం లభ్యమైంది. గత ఏడాది అశ్విని తండ్రి ధర్మారావు కరోనాతో మృతి చెందారు. అప్పటి నుంచి దిగులు ఉంటున్న అశ్విని.. తండ్రి లేడనే బాధతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Suicide, Visakhapatnam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు