వీకెండ్ వ్య‌వ‌సాయం...నెల‌కు ల‌క్ష‌పైనే ఆదాయం సాఫ్ట్ వేర్ ఉద్యోగి వినూత్న ఐడియా !

ప్ర‌కాశం జిల్లాకు చెందిన హ‌నుమంత్ రెడ్డి హైద‌రాబాద్ లో ఒక సాప్ట్ వేర్ ఉద్యోగి అంద‌రిలానే లావిష్ లైప్ ఉంటే చాల‌నుకోలేదు. పుడ‌మిత‌ల్లిని న‌మ్ముకొని ఏదో చేయాల‌నే త‌ప‌న అత‌నిలో ఆలోచ‌న రేకెత్తించింది. అదే వారంలో త‌నుకొచ్చే రెండు రోజులు సెల‌వులో వ్య‌వ‌సాయం చేస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న అత‌నిలో మెదిలింది.

news18-telugu
Updated: July 1, 2019, 8:20 PM IST
వీకెండ్ వ్య‌వ‌సాయం...నెల‌కు ల‌క్ష‌పైనే ఆదాయం సాఫ్ట్ వేర్ ఉద్యోగి వినూత్న ఐడియా !
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హ‌నుమంత్ రెడ్డి
  • Share this:

బాల‌కృష్ణ‌. ఎమ్, సీనియ‌ర్ క‌రెస్పాండెంట్ ,  న్యూస్18


నేటీ యువ‌త ఏ కోరుకుంటారు? ల‌క్ష‌ల్లో జీతం... వారంలో 5 రోజులు మాత్ర‌మే ప‌ని హైటెక్ లైప్ స్టైల్ ఇవే నేటీ యువ‌త మెద‌డులో మెదిలేవి...వీక్ ఎండ్ లో వ‌చ్చే ఆ రెండు రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటారు. అయితే ఇవన్ని వ‌దులుకొని వ్య‌వ‌సాయం చేయడానికి ఎవ‌రైన ముందుకొస్తారా? నో వే అంటారు క‌దా అలా అయితే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లు నేటీ యువ‌త‌రం ఆలోచ‌న విదానం మారుతొంది అని చెప్ప‌డానికి చాల‌నే ఉదాహార‌ణ‌లు ఉన్నాయి ముఖ్యంగా ఈ యువ‌కుడి అందుకు నిద‌ర్శ‌నం. మ‌హాన‌గ‌రంలో ల‌క్ష‌ల్లో జీతం లావీస్ లైప్ స్టైల్ ఇవ్వ‌న్ని ఉన్న వారంలో వ‌చ్చే రెండు రోజుల సెల‌వులో వ్య‌వ‌సాయం చేస్తూ ఏడాదికి 15 ల‌క్ష‌ల ఆదాయం సంపాదిస్తున్నాడు ఈ యువ‌కుడు. ప్ర‌కాశం జిల్లాకు చెందిన హ‌నుమంత్ రెడ్డి హైద‌రాబాద్ లో ఒక సాప్ట్ వేర్ ఉద్యోగి అంద‌రిలానే లావిష్ లైప్ ఉంటే చాల‌నుకోలేదు. పుడ‌మిత‌ల్లిని న‌మ్ముకొని ఏదో చేయాల‌నే త‌ప‌న అత‌నిలో ఆలోచ‌న రేకెత్తించింది. అదే వారంలో త‌నుకొచ్చే రెండు రోజులు సెల‌వులో వ్య‌వ‌సాయం చేస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న అత‌నిలో మెదిలింది.....ఇంకేముంది ఆలోచ‌న‌కు ప‌దును పెట్టాడు సాంకేతిక‌ప‌ర‌మైన ప‌రిజ్ఞానం ఉండ‌డంతో ఊర్లో త‌న‌కున్న 6 ఎక‌రాల పొలంలో ఏ పంట వేస్తే బాగుంటుందో స్ట‌డీ చేశాడు...ఇప్పుడు మార్కెట్ లో విసృతం ప్ర‌చారం పొందిన గిట్టుబాటు అవుతున్న తైవ‌న్ జామ‌కాయలు వేస్తే బాగుంటుంద‌ని 6 ఎకారాల పొలంలో తైవ‌న్ జామ వేశాడు.

ప్ర‌భుత్వ స‌హాకారంతో తొలిసారిగా త‌మ జిల్లాలో ప్ర‌యోగాత్మ‌కంగా జామ సాగుచేయ‌డం ప్రారంభించారు హ‌నుమంత్ రెడ్డి. మొక్క‌నాటిన తొమ్మిది నెల‌ల త‌రువాత కాపు వ‌చ్చింది జామ కాయ ప‌రిణామం కూడా బాగుండ‌డంతో ఒక్కొ చెట్టుకు దాదాపుగా 25 నుంచి 35 కీలోల జామ మొత్తం 6 ఏకారాల్లో నాలుగు వేల మొక్క‌లు నాటారు హ‌నుమంతు రెడ్డి అందులో నాలుగు వంద‌ల మొక్క‌లు వ్యాదుల వ‌ల‌న చ‌నిపోయాయి అయితే మీగిలిన మొక్క‌లు కాపు మాత్రం బాగుంద‌ని అంటున్నారు హ‌నుమంత్ రెడ్డి 6 ఎకారాల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా 4 ల‌క్ష‌ల పెట్టుబ‌డి పెట్టారు హ‌నుమంత్ రెడ్డి అయితే పెట్టిన పెట్టుబ‌డి మొదటి తొమ్మిది నెల‌ల‌లోనే వ‌చ్చేసింద‌ని ప్ర‌స్తుతం నెల‌కు ఎలా లేద‌న్న 80 వేలు నుంచి ల‌క్ష రూపాయిల వ‌ర‌కు దిగుబ‌డి వ‌స్తోంద‌ని అంటున్నారు ఈ యువ‌కుడు. ముఖ్యంగా వారంలో త‌న‌కు వ‌చ్చే రెండు రోజుల సెల‌వు త‌న ఊరు వెళ్లీ ఈ జామ తోట‌ను చూసుకుంటాన‌ని అంటున్నారు హ‌నుమంత్ రెడ్డి. “ ప‌స్ట్ నేను ఈ ఐడియా నా ప్రెండ్స్ కి చెప్పిన‌ప్పుడు అంద‌రు న‌వ్వారు ఏరా నువ్వేమైన సినిమా హీరో అనుకుంటున్నావా అంటూ కొంచం కామెడిగా మాట్లాడారు. అయితే త‌రువాత ఒక‌సారి మా ఊరు వ‌చ్చి చూసి నాకు వ‌స్తోన్న రిటర్న్స్ చూసిన త‌రువాత ఇప్పుడు నేను చేసిందే క‌రెక్ట్ అంటున్నారు. దీంతో పాటు వాళ్లు కూడా ఎదో చేయాల‌ని ట్రై చేస్తోన్నారు.” న్యూస్ 18 తో హ‌నుమంత్ రెడ్డి. ప్ర‌భుత్వం ప్రొత్సాకాలు అందిస్తే మ‌రింత రైతుల‌కు ప‌రిజ్ఞానం పెంచ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తాన‌ని అంటున్నారు.

తైవాన్ జామ‌కు మార్కెట్ లో ఎందుకు ఇంత గీరాకీ

జామకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. జామి కాయలో ‘సి’ విటమిన్‌ అధికంగా ఉంటుంది, తక్కువ మోతాదులో ‘ఏ’ విటమిను కూడా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యానర్స్‌ రాకుండా ఉప‌యోగ‌ప‌డుతుండ‌డంతో పాటు ముఖ్యంగా ప్ర‌స్తుతం మార్కెట్ లో ల‌భిస్తోన్న యాఫిల్ కి మించిన పోష‌క గుణాలు ఇందులో ఉండ‌డంతో మార్కెట్ లో జామకు ఇప్పుడు గిరాకి బాగుంది దీంతో అంద‌రు ఈ తోట‌ను సాగు చేయ‌డానికి ముంద‌కొస్తోన్నారు. కాస్త పండు నాణ్య‌త ఎక్కువ ఉంటే కీలో జామ మార్కెట్ లో 90 నుంచి 120 రూపాయిల వ‌ర‌కు అమ్మ‌తున్నారు తైవాన్ జామ అయితే కిలోకి ఒక‌టి లేదా రెండు మాత్ర‌మే తూగుతాయి. దీంతో దిగుబ‌డి బాగుండి లాభం కూడా పుల్ గా ఉంటుందని హ‌నుమంత్ రెడ్డి అంటున్నారు.
Published by: Krishna Adithya
First published: July 1, 2019, 8:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading