హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: స్కూల్లోనే బాలిక మెడలో తాళికట్టబోయిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే..!

Andhra Pradesh: స్కూల్లోనే బాలిక మెడలో తాళికట్టబోయిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తూర్పు గోదావరి జిల్లా (East Godawari) రాయవరంలో కలకలం రేగింది. మైనర్ బాలికను పెళ్లి (Marriage) చేసుకుంటానంటూ ఓ యువకుడు హల్ చల్ చేశాడు. విద్యార్థులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు.

  ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో కలకలం రేగింది. మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువకుడు హల్ చల్ చేశాడు. బాలిక చదువుతున్న స్కూల్లో ప్రవేశించి తాళికడతానంటూ హడావిడి చేశాడు. సహచర విద్యార్థులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. అనపర్తి మండలంలోని మహేంద్రవాడకు చెందిన స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. క్లాసులు ప్రారంభం కాకముందే అనపర్తి మండలంలోని కొప్పవరానికి చెందిన సత్తి శివారెడ్డి అనే యువకుడు స్కూల్లోకి ప్రవేశించాడు. మైనర్‌ అయిన బాలికకు తాళి కడతానంటూ క్లాస్ రూమ్ లోకి దూసుకొచ్చాడు.

  దీంతో ఒక్కసారిగా కంగారు పడిపోయిన విద్యార్థులు, విద్యార్థిని తమ్ముడు గట్టిగా కేకలు వేసి శివారెడ్డిని అడ్డుకున్నారు. విద్యార్థుల కేకలు విని టీచర్లు కూడా పరుగెత్తుకురావడంతో తాళిబొట్టును అక్కడే పడేసి బైక్ పై పారిపోయాడు.

  బాలిక తమ్ముడు ఫోన్ చేయడంతో సమాచారమందుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు నెలలుగా శివారెడ్డి తన కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటూ వేధిస్తున్నాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  ఎన్నిసార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపాడు. ఐతే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుసుకున్న యువకుడు శివారెడ్డి బాలిక ఇంటిముందే పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు.

  దీంతో స్థానికులు అతడ్ని రాయవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరించారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రాణాపాయం లేదని తెలిపారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడ్ని విచారిస్తున్నారు. అతడి తల్లిదండ్రలతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra pradesh news, Love

  ఉత్తమ కథలు