YOUNG MAN REFUSED TO MARRY HIS LOVE AFTER SPENDING ONE WEEK IN HIS HOME IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Andhra Pradesh: పెళ్లిపేరుతో వారం రోజులు ప్రియుడి ఇంట్లోనే ఉన్న యువతి... ఆ తర్వాత ఏం జరిగిందంటే...
ప్రతీకాత్మకచిత్రం
Love marriage: తామే పెళ్లి చేస్తామని నమ్మించి ఇద్దర్నీ ఇంటికి తీసుకెళ్లారు. యువతి కూడా ప్రియుడితో పాటే ఇంటికెళ్లింది. అక్కడే వారంరోజుల ఉంది. వారం రోజుల తర్వాత పెళ్లి చేసేది లేదంటూ ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు.
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో పెద్దలు ఎంట్రీ ఇచ్చారు. తామే దగ్గరుండి పెళ్లి పెళ్లి చేస్తామన్నారు. వారం రోజుల పాటు అమ్మాయిని అబ్బాయి ఇంట్లోనే ఉంచారు. కట్ చేస్తే ప్లేటు ఫిరాయించారు. అబ్బాయితో పాటు అతడి కుటుంబ సభ్యులు చేసిన మోసానికి ఆ యువతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాధవపాళెం అరుంధతివాడకు చెందిన యువతి శ్రీ సిటీలోని ఓ పరిశ్రమలో పనిచేస్తోంది. అదే పరిశ్రమలో పనిచేస్తున్న యవకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ వడమాలపేట సమీపంలోని అంజేరమ్మ ఆలయానికి వెళ్లారు. ఈ లోగా విషయం తెలుసుకున్న అబ్బాయి తల్లిదండ్రులు గుడిదగ్గర ప్రత్యక్షమయ్యారు.
తామే పెళ్లి చేస్తామని నమ్మించి ఇద్దర్నీ ఇంటికి తీసుకెళ్లారు. యువతి కూడా ప్రియుడితో పాటే ఇంటికెళ్లింది. అక్కడే వారంరోజుల ఉంది. వారం రోజుల తర్వాత పెళ్లి చేసేది లేదంటూ ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ నేపథ్యంలో గ్రామపెద్దల వద్ద పంచాయతీ పెట్టింది. పెద్దల జోక్యంతో దారిలోకి వచ్చిన అబ్బాయి తల్లిదండ్రులు వారం రోజుల్లో పెళ్లి చేస్తామని తెలిపారు. అప్పటివరకు ఎక్కడైనా హోమ్ లో ఉండాలని సూచించారు. ఈనెల 1వ తేదీన మళ్లీ తిరిగొచ్చిన యువతి పెళ్లి చేయాలని కోరగా మళ్లీ నిరాకరించారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది.
ఐతే ఈ వ్యవహారంలో ప్రియుడు తన తల్లిదండ్రులకే వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రేమ పేరుతో తనను వంచించి మోసం చేశాడని యువతి ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని.. పెళ్లి చేసుకుంటానంటేనే ఇంట్లో నుంచి వచ్చేశానని.. ఇప్పుడు తనను రోడ్డుపాలు చేయడం తగదని బాధితురాలు చెప్తోంది.