Home /News /andhra-pradesh /

YOUNG MAN KILLED BY HIS FRIENDS ON HIS BIRTHDAY IN TIRUPATHI OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Shocking Birthday: బర్త్ డేనే అతడి డెత్ డే అయింది.. మందు ఎక్కువైన ఫ్రెండ్స్ ఏం చేశారంటే..!

ప్రసన్నకుమార్ (ఫైల్)

ప్రసన్నకుమార్ (ఫైల్)

Birthday Party: అప్పటివరకు ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసిన కొడుకు హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు చనిపోయింది కార్పొరేటర్ అనుచరుడు కావడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు.

    GT Hemanth Kumar, Tirupathi, News18

    యువకులకు ఫ్రెండ్స్ అంటే పిచ్చి. ఫ్రెండ్స్ లేనిదే వారికి ఒక్కరోజు కూడా గడవదు. స్నేహాన్ని నిర్వచిస్తూ ఎన్నో సినిమాలు, మరెన్నో పాటలున్నాయి. ఓ వ్యక్తి మంచి దారిలో వెళ్లినా.. చెడ్డ దారుల్లో వెళ్లినా అందుకు స్నేహితులే కారణమవుతారు. మనం కలసి ఉండే మిత్రులను బట్టే మన ప్రవర్తన అంచనా వేసే వారు ఉన్నారు. నలుగురు మంచి మిత్రులు ఉంటే.. జీవితం సాఫీగా సాగుతుంది. అదే చెడు వ్యసనాలకు.. చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డ వ్యక్తులతో స్నేహం మన జీవితానీకె ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదు. అలాంటి ఓ యువకుడు ఫ్రెండ్స్ తో కలిసి బర్త్ డే పార్టీ చేసుకున్నాడు. ఓ రాజకీయ నాయకుడికి అనుచరుడు కావడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుండటంతో ఫ్రెండ్స్ లిస్ట్ పెద్దగానే ఉంది.

    కానీ బర్త్ డే పార్టీ.. కాస్తా అతడికి డెత్ డేగా మారుతుందని ఊహించలేకపోయాడు. అప్పటివరకు విషెష్ చెప్పిన ఫ్రెండ్సే అతడి మరణశాసనం రాశారు. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupathi) కి చెందిన రామచంద్రయ్య, పుష్పమ్మ దంపతుల చిన్నకుమారుడు ప్రసన్న కుమార్ అలియాస్ బొజ్జ అనే యువకుడు నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే తిరుపతి కార్పొరేషన్ కు నూతనంగా ఎంపికైన ఓ కార్పొరేటర్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు.

    ఇది చదవండి: రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న భార్య... ఓ రోజు ఆ విషయంలో గొడవ.. చివరకు..


    సోమవారం ఇతడి పుట్టినరోజు కావడంతో స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు తిరుపతి- రేణిగుంట మార్గంలోని ఓ లాడ్జిలో ఆదివారం సాయత్రం గది అద్దెకు తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం వరకు ఎల్లంరెడ్డి, పవన్‌కుమార్‌, బాలాజీ ఇలా త్తం ఎనిమిదిమంది స్నేహితులతో కలిసి ఆ గదిలో పార్టీ చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఎల్లంరెడ్డి, పవన్‌కుమార్‌, బాలాజీ లాడ్జీ గదినుంచి బయటకు వచ్చారు. అందరూ ఫుల్లుగా మందుకొట్టారు. మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ జరిగింది.

    ఇది చదవండి: ఆమెకు ప్రియుడు తప్ప మరో లోకం లేదట.. అందుకే కట్టుకున్నవాడిని దారుణంగా..


    ఈ గొడవలో ఐదుగురు స్నేహితులు ప్రసన్నకుమార్ ను బలవంతంగా లాడ్జి నుంచి కిందకు తీసుకువచ్చి నడిరోడ్డుపై మద్యం బాటిళ్ళతో అతి దారుణంగా పొడిచి చంపారు. ప్రసన్న కుమార్ చనిపోయాడనుకుని నిర్థారించుకున్న తరువాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంఘటన స్ధలంకు చేరుకుని కేసు నమోదు చేసిన పొలీసులు మృతిదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకు ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసిన కొడుకు హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు చనిపోయింది కార్పొరేటర్ అనుచరుడు కావడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    మీ నగరం నుండి (​తిరుపతి)

    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    ఆంధ్రప్రదేశ్
    ​తిరుపతి
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Tirupati

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు