హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: లాడ్జిలో లింగమార్పిడి ఆపరేషన్.. మర్మాంగాన్ని తొలగించిన కొద్దిసేపటికే షాకింగ్ సీన్..

Nellore: లాడ్జిలో లింగమార్పిడి ఆపరేషన్.. మర్మాంగాన్ని తొలగించిన కొద్దిసేపటికే షాకింగ్ సీన్..

మృతుడు శ్రీకాంత్ (ఫైల్)

మృతుడు శ్రీకాంత్ (ఫైల్)

Shocking: మెదడులో మెదిలిన ఆలోచనో.. శరీరంలో వచ్చిన మార్పులో లేక స్నేహితుల ప్రభావమో తెలియదుగానీ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. లింగమూర్పిడి చికిత్సకు సిద్ధమై చివరకు ప్రాణాలు వదిలాడు.

అతడికి మేనమామ కూతురితో పెళ్లైంది. అందమైన కాపురంలో చిచ్చురేగింది. ఆ తర్వాత అనుకోని వ్యక్తిలో పరిచయం అతడి జీవితాన్ని మలుపుతిప్పింది. మెదడులో మెదిలిన ఆలోచనో.. శరీరంలో వచ్చిన మార్పులో లేక స్నేహితుల ప్రభావమో తెలియదుగానీ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. లింగమూర్పిడి చికిత్సకు సిద్ధమై చివరకు ప్రాణాలు వదిలాడు. వివరాల్లోకి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రకాశం జిల్లా (Prakasham District) జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందన బి. శ్రీకాంత్ అలియాస్ అమూల్య చిన్ననతంనోలే తాపీపని కోసం హైదరాబాద్ (Hyderabad) వెళ్లాడు. 2019లో కుటుంబ సభ్యులు అతడికి మేనమామ కుమార్తెను ఇచ్చి పెళ్లచేశారు. ఆ తర్వాత ఏడాదే వారు విడాకులు తీసుకున్నారు. శ్రీకాంత్ అప్పటి నుంచి ఒంగోలులోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో విశాఖపట్నంకు చెందిన ట్రాన్స్ జెండర్ మోనాలిసాతో అలియాస్ అశోక్ తో పరిచయం ఏర్పడింది.

ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఎప్పుడూ కలిసే తిరుగుతుండేవారు. ఇదిలా ఉంటే గత ఏడాది శ్రీకాంత్ కు నెల్లూరుకు చెందిన బీ ఫార్మసీ విద్యారులైన మస్తాన్, జీవాతో పరితయం అయింది. చాటింగ్ చేసుకుంటుండగా తాను ముంబై వెళ్లి లింగమూర్పిడి ఆపరేషన్ చేయించుకుంటానని వారితో చెప్పాడు. ఐతే ముంబై వెళ్తే బాగా ఖర్చవుతుందని.. తాము తక్కువ ఖర్చుతేనే చేస్తామని మస్తాన్.. శ్రీకాంత్ తో చెప్పాడు. అందుకు శ్రీకాంత్ కూడా అంగీకరించాడు.

ఇది చదవండి: ఆ భవనంలో నుంచి నిత్యం పొగలు.. అనుమానంతో రైడ్ చేసిన పోలీసులకు షాక్..


దీంతో ఈనెల 23న మస్తాన్, జీవా, మోనాలిసా, శ్రీకాంత్ నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లోని ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. ఆ తర్వాతి రోజు ఆపరేషన్ ప్రారంభించి మిగిలిన శ్రీకాంత్ మర్మాంగాన్ని తొలగించారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర రక్తస్రావమైంది. నిముషాల్లోనే పల్స్ రేట్ పడిపోవడంతో శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచరమిచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతడి సోదరి పల్లవికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు.


ఇది చదవండి: బాలుడికి ఫోన్ కొనిస్తే ఏం చేశాడో చూడండి.. పక్కింటి మహిళ బాత్ రూమ్ కిటికీలో..


అనంతరం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లవి ఇచ్చిన కంప్లైంట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అసలు బీ-ఫార్మసీ విద్యార్థులకు ఈ ఆపరేషన్ గురించి ఎలా తెలిసింది..? సోషల్ మీడియా, యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారా..? లేక బయటి నుంచి ఎవరైనా సలహాలిచ్చారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Nellore, Transgender

ఉత్తమ కథలు