హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dandupalyam Style Murder: దండుపాళ్యం సినిమా చూసి మర్డర్.. మూడు నెలల తర్వాత వీడిన మిస్టరీ..!

Dandupalyam Style Murder: దండుపాళ్యం సినిమా చూసి మర్డర్.. మూడు నెలల తర్వాత వీడిన మిస్టరీ..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఘోరమైన మేనరిజం సినిమా అంటే మనకు గుర్తుకి వచ్చేది దండుపాళ్యం. ఈ సినిమాలో ఒళ్ళు గగుడ్పొడిచే సన్నివేశాలను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నడు ఓ వ్యక్తి. అదే స్టైల్ లో దొంగతనం చేయాలని పక్కా స్కెచ్ వేశాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.

  GT Hemanth Kumar, Tirupati, News18

  సినిమాలు సామాన్యలుపై ఏంతగానో ప్రభావం చూపుతాయి. అభిమాన నటుల చిత్రాలు విడుదల అయితే ఒక ట్రెండ్ ను క్రియేట్ చేయడమే కాదు.., అందులో హీరో నైజాన్ని., హావభావాలను అట్టే అంది పుచ్చుకుంటారు అభిమానులు. హీరో చేసే మంచి అలవాట్లను అలవర్చుకుంటే అంత ఆనందమే..! కానీ సినిమాల్లో చూపించే చెడుకు అలవాటు పడితే మాత్రం వ్యక్తిగతంగానే కాదు సమాజానికి కూడా ఇబ్బందే. సినిమాలను పోలిన సన్నివేశాలను ఇట్టే అమలు చేస్తే చూడటానికి., వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించలేము. ఎంతో ఘోరమైన మేనరిజం సినిమా అంటే మనకు గుర్తుకి వచ్చేది దండుపాళ్యం (Dandupalyam Movie) . ఈ సినిమాలో ఒళ్ళు గగుడ్పొడిచే సన్నివేశాలను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నడు ఓ వ్యక్తి. అదే స్టైల్ లో దొంగతనం చేయాలని పక్కా స్కెచ్ వేశాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.

  వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) కదిరిలో గత ఏడాది నవంబర్లో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న ఉషారాణి దారుణ హత్యకు గురైంది. అప్పట్లో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనాస్థలిలో ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో కేసు పోలీసులకు సవాల్ గా మారింది. మూడు నెలల పాటు అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు ఏకంగా 5వేల మందికి పైగా అనుమానితులను విచారించారు. 5 రాష్ట్రాల్లో 8 ప్రత్యేక బృందాలతో గాలించారు. అలాగే లక్ష ఫోన్ కాల్స్ పైగా ట్రేస్ చేశారు. ఆ ఫోన్ కాల్స్ ను ఫిల్టర్ చేసి కీలక ఆధారాలు సేకరించారు. చివరకి కదిరి పట్టణానికి చెందిన షఫీవుల్లా అనే యువకుడ్ని నిందితుడిగా తేల్చారు.

  ఇది చదవండి: బాలుడితో పిన్ని ఎఫైర్... మేటర్ బాబాయికి తెలిసింది.. ఆ తర్వాత..


  విచారణలో భాగంగా నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ తిన్నారు. క్రైమ్ సీన్స్ ను కళ్లకు కట్టినట్లుగా చూపించిన దండుపాళ్యం సినిమా స్ఫూర్తితో తాను ఈ ఘోరానికి పాల్పడినట్లు చెప్పాడు. తన ప్లాన్ లో భాగంగా ఒంటరి మహిళలను టార్గెట్ చేసిన షఫీ.. వారం రోజుల పాటు ఉషారాణి దంపతులు ఉంటున్న వీధిలో రెక్కీ నిర్వహించారు. అలాగే ఉషారాణి వివరాలను సేకరించాడు. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉండే సమయాలను తెలుసుకున్నాడు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న షఫీ.. నవంబర్ 11న ఉదయం 5గంటల సమయంలో మృతురాలి భర్త మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై దాడి చేసి హత్య చేసి బంగారం దోచుకొని పారిపోయాడు. షఫీ నేరాన్ని అంగీకరించడంతో అతడి వద్ద నుంచి 58 తులాల బంగారం, 97 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Robbery

  ఉత్తమ కథలు