Home /News /andhra-pradesh /

YOUNG GIRL MARRIED ANOTHER MAN AFTER ENGAGED WITH RELATIVE IN CHITTOOR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Andhra Pradesh: ఒకరితో నిశ్చితార్థం... మరొకరితో పెళ్లి... ఆ యువతి చేసిన పనికి తల్లిదండ్రులు షాక్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎంగేజ్ మెంట్ రోజు ఎలాంటి అభ్యంతరం చెప్పని యువతి.. ఆ ఫంక్షన్లో సంతోషంగానే గడిపింది. నవ్వుతూ మేనమాతో రింగ్ తొడిగించుకుంది.

    వాళ్లిద్దరిదీ చాలా దగ్గర బంధుత్వం. యువతి తల్లికి ఆ యువకుడు సొంత తమ్ముడు. ఇంకేముంది ఇద్దరికీ పెళ్లి నిశ్చయించారు. మేనకోడలిని పెళ్లి చేసుకుంటున్నానన్న ఆనందంలో ఉండగానే ఇద్దరికీ పెద్దలు నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం సమయంలో చక్కగానే ఉన్న యువతి రేపో మాపో పెళ్లనగా ప్లేటు ఫిరాయించింది. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె పంచాయతీ పరిధిలోని నారావారిపల్లెకు చెందిన యువకుడికి.. తమిళనాడు రాష్ట్రంలోని పరదామిలో ఉంటున్న తన అక్క కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఇద్దరికీ గతనెల 5వ తేదీన నిశ్చితార్థం చేశారు. ఎంగేజ్ మెంట్ రోజు ఎలాంటి అభ్యంతరం చెప్పని యువతి.. ఆ ఫంక్షన్లో సంతోషంగానే గడిపింది. నవ్వుతూ మేనమాతో రింగ్ తొడిగించుకుంది.

    కానీ నెలరోజులు తిరిగేసరికి అసలు విషయం బయటపడింది. వారం రోజుల క్రితం పరదామి నుంచి నారావారి పల్లె వచ్చిన యువతి.. రెండురోజుల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అందరికీ షాకిచ్చిన ఆ యువతి.. చిత్తూరుకు చెందిన ఓ యువకుడితో వెళ్లిపోయింది. అతడ్ని ప్రేమించానని.. పెళ్లి కూడా చేసుకున్నానంటూ.. ఆ ఫోటోలను తన తల్లికి వాట్సాప్ చేసింది.

    ఐతే కుమార్తె చేసిన పనికి ఐంగ్రహించిన తల్లిదండ్రులు.. యువకుడు బలవంతంగా తమ కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రేమజంటను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. మరోవైపు నిశ్చితార్థం చేసుకొని వెళ్లిపోయిన యువతితో తనకు పెళ్లొద్దని.. యువకుడు చెప్తున్నట్లు తెలుస్తోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Love marriage

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు