Home /News /andhra-pradesh /

YOUNG ENGINEER SHRIRAM WORKS WONDERS IN TRADITIONAL FARMING IN GUNTUR DISTRICT BN

ఉన్నతోద్యోగం వదులుకుని.. సాంప్రదాయ సాగులో అద్భుతాలు సృష్టిస్తున్న ఇంజనీర్..

సాగు చేసిన బంతిపూల తోటలో శ్రీరామ్..

సాగు చేసిన బంతిపూల తోటలో శ్రీరామ్..

విచ్చలవిడిగా రసాయన ఎరువులను వినియోగిస్తున్న నేటి రోజుల్లో కేవలం సాంప్రదాయ ఎరువులతో పంట సాగు చేశాడు. బెంగళూర్ నర్సరీ నుంచి తెప్పించిన బంతి మొక్కల సాగు చేపట్టాడు.

  (రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్‌18)

  చదివింది ఇంజనీరింగ్... కంప్యూటర్ సైన్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ పట్టా.. చేతిలో ఐటీ ఉద్యోగం.. సొంత ఐటీ కంపెనీ.. ఏడాదికి రూ.లక్ష ఆదాయం.. ఇవేమీ అతడికి సంతృప్తిని ఇవ్వలేదు. చిన్ననాటి నుంచే వ్యవసాయంపై ఉన్న మక్కువ అతడిని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి అగ్రికల్చర్ వైపు అడుగులు వేసేలా చేసింది. ఏసీ గదుల నుంచి పంట పొలాల బాటపట్టాడు. వ్యవసాయంలో ఆధునిక, సాంకేతికను జోడించి సాగును ప్రారంభించిన యువ ఇంజనీర్ గారపాటి శ్రీరామ్. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన గారపాటి శ్రీరామ్ 2006లో కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఐటీసీలో వెంటనే ఉద్యోగం లభించింది. అక్కడి నుంచి ఐబీఎమ్ సంస్థలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఆరేళ్లు ఉద్యోగం చేసి ఎందరో జూనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు మార్గదర్శిగా నిలిచాడు. అక్కడి నుంచి తాను సొంతగా ఐటీ కంపెనీని హైదరాబాద్‌లో స్థాపించాడు.

  తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తన కంపెనీ ద్వారా సేవలు అందించాడు. ఏసీ గదుల్లో వచ్చే చల్లటి గాలి కంటే పంట పొలాలపై మట్టి గాలిపై ఆసక్తి పెరిగింది శ్రీరామ్‌కి. తాతల కాలం నుంచి భూస్వాములుగా వీరి కుటుంబం ఎదిగింది. అయితే విద్యావంతుడైన శ్రీరామ్ తండ్రి రామ్మోహనరావు వ్యవసాయంపై మక్కువ ఉన్నా కూడా ఉద్యోగరీత్యా దూరంగా ఉండాల్సి వచ్చింది. భద్రాచలం ఐటీస్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. నిత్యం రైతులతోనే తన తండ్రికి కూడా అనుబంధం ఉండేది. శ్రీరామ్‌కి కూడా చిన్నతనం నుంచే రైతుల సమస్యలపై స్వష్టమైన అవగాహన ఉంది. ఏడాది క్రితం హైదరాబాద్ నుంచి నరసరావుపేటకు వచ్చిన శ్రీరామ్ తన ఆలోచనను వ్యవసాయం వైపు మళ్లీంచాడు.

  తాను స్థాపించిన ఐటీ కంపెనీని వదిలి ఉప్పలపాడులోని తన ఎనిమిది ఎకరాల మామిడితోటలో వ్యవసాయాన్ని ప్రారంభించాడు. సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ భూముల్లో ఉన్న మామిడి తోటలోనే అంతర్గత పంటలను సాగు చేయాలనే ఆలోచనకు శ్రీరామ్ శ్రీకారం చుట్టారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాడు. ముందుగా ఎకరంలో పుచ్చకాయ సాగు, బంతి పులా సాగును ప్రారంభించి, మల్చింగ్ విధానంతో పాటు డ్రిప్ ద్వారా నీటి వృథాను అరికడుతూ నేరుగా మొక్క మొదళ్లకు నీరు అందేలా చర్యలు చేపట్టాడు. ప్రభుత్వం సబ్సిడీని అందుకు వినియోగించుకున్నాడు.

  విచ్చలవిడిగా రసాయన ఎరువులను వినియోగిస్తున్న నేటి రోజుల్లో కేవలం సాంప్రదాయ ఎరువులతో పంట సాగు చేశాడు. బెంగళూర్ నర్సరీ నుంచి తెప్పించిన బంతి మొక్కల సాగు చేపట్టాడు. మార్కెటింగ్‌లో మెళకువలను కూడా తెలుసుకున్నాడు. ఆరుగాలం రైతు కష్టించి పండించిన పంట దళారుల చేతుల్లోకి వెళ్లి నష్టాలు బాట పట్టె అంశాన్ని కూడా శ్రీరామ్ గుర్తించాడు. దీంతో పండించిన పంటను నేరుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లి మార్కెటింగ్ చేస్తున్నాడు. దీనివల్ల మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాడు. గత ఏడాది వచ్చిన మామిడి కాయలను ఆటో ద్వారా విక్రయించాడు. బంతి పూలను కూడా మార్కెట్‌కి కాకుండా రిటైలర్ వ్యాపారులకు అందిస్తున్నాడు.

  దీంతో లాభాలను ఒడిసిపట్టగలిగాడు. గిట్టు బాటు ధరలు లేక, పెట్టిన పెట్టుబడికి అసలు రాక ఇబ్బంది పడుతున్న రైతులకు సందేశాన్ని ఇస్తున్నాడు. తనదైన శైలిలో వ్యవసాయం చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందంటున్నాడు శ్రీరామ్.

  వ్యవసాయ మెళకువలు, చీడ పురుగు నుంచి నివారణ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రైతులు నష్టపోకుండా ఉండేందుకు శ్రీరామ్ ఎంతోమంది యువరైతులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాడు.
  Published by:Narsimha Badhini
  First published:

  Tags: Agriculture, Andhra Pradesh, Guntur

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు