YOU CAN COMPLETE AMARANTH YATRA IN ONE DAY WITH THESE STEPS FULL DETAILS HERE PRN GNT
Amarnath Yatra: ఏపీ నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నారా..? ఒక్కరోజులో టూర్ కంప్లీట్ చేయొచ్చు..! ఎలాగంటే..!
ప్రతీకాత్మక చిత్రం
మరికొన్ని గంటల్లో ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) మొదలు కానుంది. ఇప్పటికే అమర్నాథ్ యాత్ర కోసం జమ్మూలోని బేస్ క్యాంప్‌ల దగ్గరకు వందలాది మంది భక్తులు చేరుకున్నారు. టెర్రరిస్టుల అటాక్‌లను పసిగట్టేందుకు ప్రత్యేక జాగిలాలను కూడా వాడుతున్నారు.
మరికొన్ని గంటల్లో ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) మొదలు కానుంది. ఇప్పటికే అమర్నాథ్ యాత్ర కోసం జమ్మూలోని బేస్ క్యాంప్‌ల దగ్గరకు వందలాది మంది భక్తులు చేరుకున్నారు. టెర్రరిస్టుల అటాక్‌లను పసిగట్టేందుకు ప్రత్యేక జాగిలాలను కూడా వాడుతున్నారు. జూన్ 30 నుంచి 43రోజుల పాటు సాగనున్న ఈ అమర్నాథ్ యాత్ర ఆగస్టు 11న ముగియనుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా అత్యంత కష్టంగా మంచు కొండల్లో చేసే ఈ సాహసయాత్ర కోసం దేశంలోని నలుమూలల నుంచి శివయ్య భక్తులు వస్తుంటారు. భారతదేశం (India) ని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో అమర్నాథ్ ఒకటి. జీవితంలో ఒక్కసారైనా ఆ అమర్నాథుడి దర్శనం చేసుకోవాలని ప్రతి శివభక్తుడు అనుకుంటాడు. అయితే ఇక్కడికి మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్లాలంటే వీలుకాదు. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే ఈ అమర్నాథ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.
నిత్యం మంచుతో కప్పబడి ఉండే అమర్నాథ్ క్షేత్రం
మనదేశంలోని శిఖరాగ్రాన ఉన్న జమ్ముకశ్మీర్‌లో ఈ అమర్నాథ్ గుహ ఉంది. హిమాలయాల్లోని దక్షిణ కశ్మీర్ కొండల్లో 3,888 మీటర్ల ఎత్తులో..శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. ఒక్క వేసవి కాలంలో తప్ప మిగిలిన ఏడాది మొత్తం ఈ అమర్నాథ్ గుహ అంతా మంచుతో కప్పబడే ఉంటాయి.
భక్తులు ఎంత వయస్సున్న వాళ్లయినా ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్ళతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు. అమర్నాథ్ యాత్రకు లాంఛనంగా శ్రీకారం చుడుతూ ప్రథమ పూజను నిర్వహించారు. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని పరమశివుని పుణ్యక్షేత్రమైన అమర్నాథ్లో జ్యేష్ఠ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పూజలు జరిపారు.
అమర్నాథ్ యాత్ర ను పెహల్గావ్ నుండి ప్రారంభిస్తారు. అక్కడకు చేరుకోవాలంటే శ్రీనగర్ నుంచి 140 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడనుండి పంచతరణి వరకు హెలికాఫ్టర్‌లో ప్రయాణం చేయాలి. అక్కడనుండి గుర్రాలు, డోలీలు, నడుచుకుంటూ కానీ సుమారు ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అప్పుడు కానీ ఆ జంగమేశ్వరుడు భక్తులకు దర్శనం ఇవ్వడు.
భక్తుల కోసం హెలికాఫ్టర్ సర్వీస్
ఈ ప్రయాణం ఎన్నో ఎంతో సాహసంతో కుడి ఉంటుంది. అయితే భక్తుల సౌకర్యార్థం ఈ ఏడాది నుంచి హెలికాఫ్టర్ సర్వీస్‌ను ప్రారంభించారు. శ్రీనగర్ నుండి పంచతరణి వరకు హెలికాఫ్టర్ సర్వీసును జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ప్రారంభించింది.
ఒక్కరోజులో అమర్నాథ్ యాత్ర..!
ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకొని శ్రీనగర్ నుండి పంచతరణి వరకు నేరుగా ప్రయాణించ్చొచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అమర్నాథ్ యాత్రను ఒక్క రోజులో ముగించుకుని అవకాశం ఉంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.