హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డికి అస్వస్థత.. రాయలసీమ గర్జనలో మాట్లాడుతూ కళ్లు తిరిగి పడిపోయిన యువనేత

Breaking News: బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డికి అస్వస్థత.. రాయలసీమ గర్జనలో మాట్లాడుతూ కళ్లు తిరిగి పడిపోయిన యువనేత

బైరెడ్డి సిద్ధార్థ  రెడ్డికి స్వల్ప అస్వస్థత

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి స్వల్ప అస్వస్థత

Breaking News: వైసీపీ యువ నేతకు స్వల్ప అస్వస్థత చోటు చేసుకుంది. అది కూడా రాయలసమీ గర్జన సభలో మాట్లాడుతుండగానే.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అంతా షాక్ కు గురయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Breaking News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఫుల్ క్రేజ్ ఉన్న యువ నేతల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddharth Reddy) ఒకరు. అందుకే వైసీపీ (YCP) సమావేశాలు ఎక్కడ జరుగుతున్నా.. అక్కడకు ప్రత్యేకించి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పిలిపించి.. సభలను సక్సెస్ చేస్తున్నారు అంతా.. దీంతో  ఇలా  వరుసగా సమావేశాలు అంటూ తిరుగుతున్నారు ఆయన.. తాజాగా కర్నూలు (Kurnool) వేదికగా జరుగుతున్న రాయలసీమ గర్జన (Rayalaseema Garjana) సభకు హాజరు అయిన ఆయన.. అనుకోకుండా కళ్లు తిరిగి పడిపోయారు. సభలో మాట్లాడిన తరువాత ఆయన ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన ఆయనను చూసి సభలో ఉన్నవారు షాక్ అయ్యారు. ఆయన కాసేపటికే తేరుకున్నారు. విరామం లేకపోవడంతోనే అలా పడిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు..

అంతకముందు సీమ గర్జన సభలో మాట్లాడిన సిద్ధారెడ్డి.. తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై మండిపడ్డారు. ఇక్కడి పిల్లలు చదువు కోసం.. ఉద్యోగం కోసం.. హైదరాబాద్ , బెంగళూర్, మద్రాస్ వెళ్లాలా.. ఇక్కడి వారికి ఇక్కడ అవకాశాలు కలిగించరా.. రాయలసీమలో ఒక రాజధాని ఏర్పాటు చేస్తే..? చంద్రబాబుకి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు

రాయలసీమ నుంచి ఇంత మంది ముఖ్యమంత్రులు వచ్చారు.. కానీ సీమ ఇప్పటికీ వెనుకబడే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ిఇద్దరూ సీమను అస్సలు పట్టించుకోలేదని.. కేవలం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే సీమను అన్ని విధాల మేలు చేస్తారని నమ్ముతున్నామని బైరెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి : ఆ వైసీపీ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారా..? రూమార్లపై క్లారిటీ ఇచ్చేసిన సీనియర్ నేత

ప్రజలు ఎవరూ కోరుకోని రాజధానిని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయాలి అనుకున్నారని.. కేవలం తన స్వార్థం.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఆయన అమరావతిని రాజధానిగా ప్రకటించారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడ ప్రజలకు ఏమీ చేయలేదని.. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ను డవలప్ చేయాలని చూస్తుంటే.. చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి : శ్రీవారి సన్నిధిలో భారత రాష్ట్రపతి.. ద్రౌపది ముర్ముకి శ్రీవారి ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించిన అర్చకులు

అంతేకాదు ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై చంద్రబాబు నాయుడు రాయలసీమ వస్తే.. ఇక్కడి  ప్రజలు తిరగబడాలి అని పిలుపు ఇచ్చారు. అప్పుటికైనా చంద్రబాబు మనసు మారుతుందని.. రాయలసీమ గురించి ఆలోచిస్తారని బరెడ్డి సిద్ధార్థ  రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు లాంటి నేతలు ఎందరు అడ్డు పడినా.. రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేసి తీరుతామన్నారు బైరెడ్డి సిద్ధారెడ్డి.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Three Capitals, Kurnool

ఉత్తమ కథలు