Home /News /andhra-pradesh /

YCP WOMEN LEADER FIRE ON SAME PARTY MLA SHE GAVE SERIOUS WARNING IN MEETING NGS

YCP Women Leader: నీ ఇంటికొచ్చా.. నీ గుమ్మానికొచ్చా అంటూ వైసీపీ ఎమ్మెల్యేకు వార్నింగ్.. అదే పార్టీ మహిళా నేత ఫైర్

ఎమ్మెల్యే పై అదే పార్టీ మహిళ ఫైర్

ఎమ్మెల్యే పై అదే పార్టీ మహిళ ఫైర్

YCP Women Leader: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలో వర్గ పోరు రచ్చ రచ్చ అవుతోంది. గతంలో పార్టీ లైన్ దాటాలి అంటే అంతా భయపడేవారు.. కానీ జగన్ పాలనకు రెండున్నరేళ్లు దాటాకా..? ధిక్కార స్వరాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళా నేత అయితే.. స్థానిక ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ఇంకా చదవండి ...
    YCP Women Leader: అధికార పార్టీలో ధిక్కార స్వరం రోజు రోజుకూ పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం వరకు పార్టీ లైన్ దాటాలి అంటే వైసీపీ నేతలు భయపడేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్గ పోరు పెరుగుతోంది. ఏ పార్టీ అయినా అక్కడక్కడా.. స్థానిక నేతల మధ్య విబేధాలు ఉండడం కామన్.. కానీ ఇప్పుడు వైసీపీ సీనియర్ నేతలు.. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా నేత అయితే.. నేరుగా స్థానిక ఎమ్మెల్యేను సవాల్ చేస్తూ ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. అంతకుముందు అనకాపల్లికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరబద్ర రావు.. నేరుగా జగన్ పాలనలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయని.. దీనిపై అధినేత చూసుకోవాలని సూచనలు కూడా చేశారు. ఆయన వ్యాఖ్యల కలకలం కొనసాగుతున్నాయి. సరిగ్గా ఆయన వ్యాఖ్యలకు ఒక రోజు ముందే మరో మహిళా నేత వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె కామెంట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అది కూడా ఆమె నేరుగా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను నోటికి ఇష్టం వచ్చినట్టు తిడుతూ.. విమర్శలు చేయడం వైసీపీ వర్గాల్లో సంచలనంగా మారాయి.

    అది కూడా ఆయన ఓ ఎమ్మెల్యే.. లక్షలాది మందికి ప్రతినిధి. ఐనా మహిళా నేత ఏ మాత్రం భయ పడలేదు. ఆమె ఆగ్రహం కాస్త కట్టలు తెచ్చుకుంది. అంతే వెనుక ముందూ ఏమీ ఆలోచించలేదు. మాటల తూటాలు పేల్చింది అది కూడా ఓ బహిరంగ సభలోనే.. కృష్ణా జిల్లా కైకలూరు(Kaikaluru) ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుపై (Dulam Nageshwararao) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అది కూడా సొంత పార్టీకి చెందిన మహిళా లీడర్‌ యలవర్తి భవాని ఈ వ్యాఖ్యలు చేయడం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. సొంత పార్టీ మహిళనైన తనకే గౌరవం ఇవ్వని ఎమ్మెల్యే ప్రజలకు ఎలా ఇస్తాడని సభా వేధికపైనే ఆమె నిలదీశారు.

    ఉగాది(Ugadi) రోజు కృష్ణా జిల్లాలోని ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకురాలు తిరువీధుల శారద విందు ఏర్పాటు చేశారు. అయితే ఆ విందు సభకు వచ్చిన భవానీ మైకు అందుకోవడమే ఆలస్యం.. స్థానిక ఎమ్మెల్యేపై తన ప్రతాపం చూపారు. ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తాను ఒక పనిపై ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే కనీస మర్యాద ఇవ్వకుండా తనను అవమానిస్తూ మాట్లాడారని ఆరోపించింది ఆమె. సొంత పార్టీ నేత అని కూడా చూడకుండా దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు