హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Raghurama: సీఎం జగన్ తో చిరంజీవి భేటీపై రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు.. జగన్ కేసులతో లింక్ పెట్టిన రాజుగారు

Raghurama: సీఎం జగన్ తో చిరంజీవి భేటీపై రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు.. జగన్ కేసులతో లింక్ పెట్టిన రాజుగారు

వైసీపీ (YCP) రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghurama Krishnam Raju) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్ (AP CM Jagan) తో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi( భేటీ అవడంపై రఘురామ స్పందించారు.

ఇంకా చదవండి ...

  వైసీపీ (YCP) రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghurama Krishnam Raju) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్ (AP CM Jagan) తో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi( భేటీ అవడంపై రఘురామ స్పందించారు. సీఎం జగన్ పై ఉన్న కేసులకి.. చిరంజీవి రాకకు ఆయన తనదైన శైలిలో లింక్ పెట్టారు. ఆచార్య సినిమా ప్రొడ్యూసర్ సీఎం జగన్, ఆయనకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన కేసుల్లో చేదోడువాదోడుగా ఉంటారని.. అందుకే ఆయనకు అపాయింట్ మెంట్ దొరికి ఉండొచ్చన్నారు. సీఎంతో చిరు భేటీ తర్వాత అయినా సినిమా వాళ్లపై వైసీపీ నేతల అవాకులు చవాకులు పేలడం మానాలన్నారు. ఇకనైనా సీఎం జగన్.. పవన్ పైనా, సినిమా వాళ్లపైనా ద్వేషం తగ్గించుకుంటారని ఆశిస్తున్నానన్నారు. సీఎం జగన్ ప్రజలకు ఆనందాన్నిచ్చే సినిమా ఇండస్ట్రీని నాశనం చేయడం సరికాదన్నారు. వినోదాన్ని తక్కువధరకు ఇవ్వాలన్న ఫార్ములాను ఇతర వస్తువులకు కూడా వర్తింపజేస్తే బాగుంటుందని రఘురామ అన్నారు.

  ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో అవసరం లేకపోయినా లక్షలాది మందిని నియమించి ఇప్పుడు వారి జీవితాలతో ఆడుకుంటున్నారన్నారి రఘురామ ఆరోపించారు. ఉద్యోగులను లక్షల్లో నియమించి మోసం చేశారని ఆరోపించారు. నిరసన తెలుపుతున్న ఉద్యోగుల జీతాలను కట్ చేయిస్తున్నారని ఆరోపించారు. సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు పథకాలను కూడా కట్ చేసి ఇప్పుడు పర్మినెంట్ చేయకుండా మోసం చేశారన్నారు రఘురామ.

  ఇది చదవండి: సీఎం జగన్ తో ముగిసిన చిరంజీవి భేటీ.. మెగాస్టార్ చెప్పిన పాయింట్స్ ఇవే..!

  ప్రజల్లో తిరిగేందుకు సీఎంకు ధైర్యం చాలడం లేదంటూ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10-15 కిలోమీటర్లకే హెలికాఫ్టర్లో వెళ్లాల్సిన అవసరం సీఎంకు ఎందుకొచ్చిందో అర్ధం కావడం లేదన్నారు. అంతదూరం రోడ్లకు ఇరువైపులా వేసేందుకు వలలు లేకనే సీఎం అలా హెలికాఫ్టర్లో వెళ్లి ఉండొచ్చన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు వలలను అడ్డుపెట్టుకోవాల్సిన అవసరమేంటన్నారు. ప్రజల మద్దతుతో గెలిచిన వ్యక్తికి ప్రజలంటే ఎందుకు భయమని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

  ఇది చదవండి: వైసీపీకి షాకిచ్చేలా రఘురామ వ్యూహం.. ఇతర పార్టీలదీ అదే పరిస్థితి.. అందుకే ఆ నినాదమా..?

  సొంత నియోజకవర్గానికి వెళ్లే అంశంపైనా రఘురామ కృష్ణంరాజు స్పందించారు. తన ఢిల్లీ వాసాన్ని రామాయణ, మహాభారతాలతో పోల్చారాయన. రావణ సంహారానికి ముందు రాముడు 14ఏళ్లు వనవాసం చేశాడని.. ధుర్యోధనుడ్ని సంహరించడానికి పాండవులు కూడా వనవాసం చేశారన్నారు. తనకు మాత్రం అంత సమయం పట్టదన్నారు. 8 నెలలుగా ఢిల్లీలో తలదాచుకున్నానని తెలిపారు. ఈ ఏడాది మే 14లోపు తన ఢిల్లీ వాసం పూర్తవుతుందని భావిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక సీఐడీ అడిషన్ డీజీ సునీల్ కుమార్ ను కులంపేరుతో దూషించానంటూ తనపై కేసు పెట్టడాన్ని రఘురామ ఖండించారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, MP raghurama krishnam raju

  ఉత్తమ కథలు