నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఊగిసలాడిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnam Raju) వ్యవహారం ఇప్పుడు ఒక క్లారిటీకి వచ్చింది. తాజాగా చేతనైతే అనర్హత వేయి వేయించండి.. లేదంటే నేనే రాజీనామా చేస్తా అని ప్రకటించి సంచలనం సృష్టించారు. దీంతో రఘురామకృష్ణంరాజు విసిరిన బౌన్సర్ ను ఎలా డిఫెన్స్ చేయాలో తెలియక అధికారపార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అందుకే ఈ అంశంపై మీడియా ముందు కాస్త ఆచి తూచి మాట్లాడుతున్నాయి వైసీపీ (YSRCP) శ్రేణులు. అయితే ఉన్నట్టుండి ఈ రెబల్ ఎంపీ ఈ స్థాయిలో సవాల్ విసరడం వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ నే ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అమరావతి తన ఎన్నికల అజెండగా తీసుకోవడం వెనుక రఘురామకృష్ణం రాజు చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది.
అసలు తాను పోటీ చేసే ప్రాంతం అసలు రాజధానికి ప్రాంతానికి సంబంధం లేకపోయినా ఈ నేత అమరావతి అజెండా తీసుకోవడమేంటని తొలుత అందరూ ఆశ్చర్యపోయినా.., నెమ్మది నెమ్మదిగా ఆయన మాస్టర్ బ్రెయిన్ తెలుస్తోంది. వైసీపీ తరుపున ఎంపీగా గెలిచినప్పటి నుంచి గ్యాప్ ఇవ్వడకుండా ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతూ సొంత పార్టీ నేతలకు పక్కలో బల్లెంలా మారారు రఘురామకృష్ణం రాజు. అప్పుడుడప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గ్యాప్ ఇచ్చినా ఈ రెబల్ ఎంపీ మాత్రం ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ నిత్యం వార్తల్లో ఉన్నారు.
ఈ మాటల యుద్ధాన్ని తాజా తన ప్రకటన ద్వారా ఒక కొలిక్కి తీసుకొచ్చారాయన. తన ఎన్నికల అజెండ అమరావతి అనేది తెలుగు దేశం పార్టీ అజెండా, చంద్రబాబునాయుడి కలల రాజధాని అని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లతానని ప్రకటించడం వెనుక అసలు కిటుకు వెరే ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. రఘురామకృష్ణం రాజు గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నాయకుడు కాకపోయినా ఆయన ఈ నినాధాన్ని కావాలనే ఎత్తుకున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం ఎర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ వైఫల్యాలపై కాకుండా అమరావతిని ఏజెండాగా చేసుకోవటంలోనే ఈ రెబల్ ఎంపీ తెలివి ఉందని అంటున్నారు రాజకీయవిశ్లేషకులు.
రఘురామకృష్ణంరాజు తీసుకున్న అజెండా అమరావతి కాబట్టి అది ప్రతిపక్ష తెలుగుదేశం ప్రధాన నినాదం. జగన్ అధికారంలకి వచ్చినప్పటి నుంచి ఇదే అంశంపై ఆ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలను, ఆందోళనలు చేస్తోంది కూడా. సరిగ్గా ఇదే పాయింట్ ను రఘురామకృష్ణం రాజు క్యాష్ చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీ అజెండను ఎత్తుకుంటే తప్పకుండా ఆ పార్టీ తనకే మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. పోటీ పెట్టే అంశంపై చంద్రబాబు తర్జనభర్జ చేసుకోవాల్సి వస్తుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే బీజేపీ కూడా అమరావతికి మద్దతు పలుకుతుంది బీజేపీకి సన్నిహితంగా ఉన్న జనసేన కూడా అనివార్యంగా రఘురామకృష్ణం రాజుకి మద్దతివ్వక తప్పదు.
ఇలా మూడు పార్టీలు తనకు ప్రత్యేర్థలను పెట్టకుండ ఉండడమే కాకుండా తమ మద్దతు కూడా ఆయన ఇచ్చేలా ఈ రెబల్ ఎంపీ స్కైచ్ వేసి ఈ ప్రకటన చేశారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ఇదేజరిగితే ఈ ఉప ఎన్నికలో బీజేపీ, టీడీపీ, జనసేనలు ఒక వైపు.., అధికార వైసీపీ ఒక్కటి ఒకవైపు ఉండాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా రాజులు వైసీపీపై గుర్రుగా ఉన్నారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తో పాటు రఘురామ పట్ల ప్రభుత్వం వ్యవహారించిన తీరు ఆ సామాజికవర్గం కాస్త అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని సమీకరణాల నేపథ్యంలో ఎలా చూసుకున్నా తనకే అన్ని విధాలా కలిసోస్తుందని భావించే రఘురామ కృష్ణంరాజు అమరావతిని ఎజెండాగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.