YCP REBAL MP RAGHURAMA KRISHNAM RAJU KEY DECISION HE SAID READY TO RESIGN FOR HIS MP POST WHAT NEXT NGS
YCP MP: పదవికి రాజీనామా.. వైసీపీ ఎంపీ సంచలన ప్రకటన.. నెక్స్ట్ ఏంటి..?
ప్రతీకాత్మకచిత్రం
YCP MP Will Resign: ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నిక తప్పేలా లేదు.. స్వయంగా ఎంపీనే ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ప్రకటించారు.. మళ్లీ ఎన్నికలకు వెళ్దామని.. ప్రభుత్వంపై ఎంత ప్రజా వ్యతిరేకత ఉందో తెలుస్తుంది అంటూ సవాల్ విసిరారు.
YCP Rebal MP Raghurama Krishnama Raju: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో ఎన్నికకు సమయం ఆసన్నమైందా..? అవును అనే అంటున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు (MP Raghu Rama Krishnama Raju).. ఆయన వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు.. అదే పార్టీలో కొనసాగుతున్నారు.. కానీ ప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నారు. దీంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాని వైసీపీ నేతలు (YCP Leaders) పదే పదే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆయన్ను పదవి నుంచి తప్పించే విధంగా చర్యలు తీసుకోవాలి అంటూ లోక్ సభ స్పీకర్ కూడా వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.. అయినా రఘురామ కృష్ణరాజు తగ్గిదేలే అంటూ.. మొండిగా పోరాడుతూ వచ్చారు. కానీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఊహాగానాలకు తెరదించుతూ ఆయనే కీలక ప్రకటన చేశారు..
త్వరలోనే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను అంటూ ఎంపీ రఘురామ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాని స్పష్టం చేశారు. తనపై అనర్హత వేటు వేయించడానికి ఎంత సమయం కావాలో చెప్పాలని ఇతర వైసీపీ ఎంపీలకు మరోసారి సవాల్ విసిరారు. అక్కడితోనే ఆయన ఆగలేదు. తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన వెంటనే.. రాజధాని అమరావతి (Amaravati)ఎజెండాతో మళ్ళీ ఎన్నికలకు వెళ్తానని ప్రకటన చేశారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో తన ఎన్నిక ద్వారా నిరూపిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి..
చాలా కాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్ననరసాపురం ఎంపీ రఘురామకృష్ణమ రాజు (Raghurama Krishnam Raju) రాజీనామాకు రెడీ అవడానికి అసలు కారణం.. బీజేపీ కేంద్ర పెద్దలే అని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. మరోవైపు రెండు రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ భేటీ అయ్యారు. వీరితో భేటీ అయిన సందర్భంలోనే స్పష్టమైన హామీ తీసుకున్నట్టు సమాచారం. వారితో చర్చించిన తరువాత రఘురామ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.. అదే ధైర్యంతో ఆయన వైసీపీకి సవాల్ విసిరారని.. అలాగే అమరావతిని తన ముఖ్య అజెండాగా ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అందుకే ఆయన ఇప్పుడు నరసాపురం నుంచి మళ్లీ పోటీ చేయడం జరిగితే.. దానికంటే ముందే ఆయన బీజేపీ తీర్థంపుచ్చుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే బీజేపీ అభ్యర్థిగానే ఆయన నరసాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు.. ఏపీలో పొత్తుల కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు సైతం.. ఆ ఎన్నికల్లో రఘురామకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా అన్ని లెక్కలు వేసుకున్న తరువాతే ఆయన తన పదవికి రాజీనామా చేసిట్టు పొలిటికల్ టాక్..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.