RRR: ఆంధ్రప్రదేశ్ (Andhar Pradesh) లో ఎన్నికలు ముందస్తే వస్తాయా..? మొన్నటి వరకు ముందస్తు లేనే లేదని చెబుతున్న వైసీపీ నేతలు (YCP Leaders).. ఇప్పుడు స్టాండ్ మార్చినట్టు ఉన్నారు.. తాజాగా సజ్జల (Sajjala) అయితే.. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు అంటూ ముందస్తు ఎన్నికలపై హింటు ఇచ్చారు. దీంతో విపక్షాలన్నీ ముందే ఎన్నికలు ఉంటాయని.. యుద్ధానికి రెడీ అవుతున్నాయి. ముందస్తు అయినా.. రెండేళ్ల తరువాత ఎన్నికలు వచ్చిరా.. ఇప్పటి నుంచే అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు.. విపక్షాలను సైతం దమ్ముంటే ఒంటరిగా రండి అని సవాల్ విసురుతున్నారు వైసీపీ నేతలు.. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం.. సింగిల్ గా వస్తామా.. గుంపులుగా వస్తామా అన్నది తమ ఇష్టమని.. అది చెప్పడానికి మీరెవరు అని ప్రశ్నిస్తున్నారు. ఇలా అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరి విమర్శలు ఎలా ఉన్నా.. తాజాగా పవన్ (Pawan) వ్యాఖ్యలతో టీడీపీ (TDP)-జనసేన (Janasena) పొత్తు ఉంటుందని స్పష్టత వచ్చేసింది. ఇక లెక్క తేల్చాల్సింది బీజేపీ (BJP) మాత్రమే.. అయితే తాజాగా ఈ పొత్తులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓటమి ఖాయం అంటున్నారు ఎంపీ రఘురామ. వచ్చే ఎన్నికల్లో తనుకు ఉన్న సమాచారం వరకు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని.. దీంతో కచ్చితంగా వైసీపీ కచ్చితంగా ఓడిపోతుందనే లెక్కలు ఉన్నాయి అంటున్నారు. అందులో ఎవరూ ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదంటున్నారు. ఆ భయం వైసీపీ నేతల్లో క్లియర్ గా కనిపిస్తోందని అన్నారు. ఎందుకంటే చంద్రబాబు త్యాగం చేస్తానంటే వైసీపీకి భయం ఎందుకు? భయం అని రఘురామ ప్రశ్నించారు.
ఇదీ చదవండి : ఈ నగరానికి ఏమైంది..? మొన్న చాక్లెట్లు.. ఇప్పుడు మత్తు ఇంజక్షన్లు..
ప్రతిపక్షాలు పాలకపక్షాన్ని ఓడించాలని చూడటం సహజం.. అందుకే ప్రతిపక్షాల ఓట్లను చీలనివ్వబోనని పవన్ కళ్యాణ్ చెప్పారు. చంద్రబాబు సభలకు సహటీజంగానే ప్రజలు దండిగా వచ్చారు. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వను.. ప్రజల కోసం ఏ త్యాగాలకైనా సిద్ధం అని ఆయనా చెప్పారు. ఆ వ్యాఖ్యలను చూసి తమ వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం, పరిపాలన బాగుంటే ప్రజలు ఓట్లేస్తారు. లేదంటే లేదు...' అని రఘురామ పేర్కొన్నారు. అయితే ఆయన కూడా అదే ధీమాతో రాజీనామాకు సిద్ధమవుతున్నారా అనే ప్రచారం ఉంది. రెండు పార్టీల పొత్త ఖరారు అయిన తరువాత.. రఘురామ తన ఎంపీ పదవితో పాటు.. వైసీపీ రాజీనామా చేస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ తరుపున తాను పోటీ చేసి.. జనసేన, టీడీపీ మద్దతు తీసుకుంటే గెలుపు తనదే అనే ధీమాలో రఘు రామ కనిసిస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.. ఒకవేళ నిజంగా రఘురామ బీజేపీలో చేరితే.. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని సూచించేవారిలో రఘురామ కూడా ఉంటారు అనడంలో సందేహం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, MP raghurama krishnam raju, Ycp