హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

PMAY(U) Houses in AP: ఏపీలో పీఎంఏవై ఇళ్లపై బీజేపీ చెప్పేలెక్కలు సరైనవేనా..? కేంద్ర మంత్రి ఏమన్నారంటే..!

PMAY(U) Houses in AP: ఏపీలో పీఎంఏవై ఇళ్లపై బీజేపీ చెప్పేలెక్కలు సరైనవేనా..? కేంద్ర మంత్రి ఏమన్నారంటే..!

రాజ్యసభ సభ్యులు పరిమల్ నత్వానీ

రాజ్యసభ సభ్యులు పరిమల్ నత్వానీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) గృహాలపై ఇప్పటికీ సరైన స్పష్టతలేదు. బీజేపీ నేతలు బయట లక్షల ఇళ్లు ఇచ్చామని చెబుతున్నా సరైన ఆధారాలు లేకపోవడంతో పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) గృహాలపై ఇప్పటికీ సరైన స్పష్టతలేదు. బీజేపీ నేతలు బయట లక్షల ఇళ్లు ఇచ్చామని చెబుతున్నా సరైన ఆధారాలు లేకపోవడంతో పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ కేంద్రాన్ని ప్రశ్నించారు. సోమవారం పరిమళ్ నత్వానీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానమిస్తూ పూర్తి సమాచారాన్ని అందించారు. మంత్రి అందించిన వివరాల ప్రకారం పీఎంఏవై-యూ కింద అత్యధికంగా కృష్ణా జిల్లాలో 2,40,402 ఇళ్లు మంజూరు కాగా, చిత్తూరు జిల్లాలో 2,13,854, పశ్చిమగోదావరి జిల్లాలో 2,00,987 ఇళ్లు మంజూరైనట్లు వివరించారు.

  జిల్లాల వారీగా చూస్తే అనంతపురం జిల్లాకు 1,58,204, చిత్తూరు జిల్లాకు 2,13,854, తూర్పుగోదావరి జిల్లాకు 1,86,095, గుంటూరు జిల్లాకు 1,76,551, కడప జిల్లాకు 1,21,023, కృష్ణాజిల్లాకు 2,40,402, కర్నూలు జిల్లాకు 1,54,595, ప్రకాశం జిల్లాకు 1,07,547, నెల్లూరు జిల్లాకు 1,30,949, శ్రీకాకుళం జిల్లాకు 1,08,176, విశాఖపట్నం జిల్లాకు 1,20,369, పశ్చిమగోదావరి జిల్లాకు 2,00,987 మొత్తం 20,40,541 ఇళ్లు కేటాయించినట్లు కేంద్రం తెలిపింది.

  ఇది చదవండి: జగన్ బెయిల్ రద్దు అంశంలో కీలక పరిణామం.. ఏపీ సీఎంకు తెలంగాణ హైకోర్టు నోటీసులు..


  ఏపీకి సంబంధించిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతున్న పరిమళ్ నత్వానీ ఇటీవల ఏపీ దిశ బిల్లు పరిస్థితి ఏంటని.. అసలు ఏపీ ప్రభుత్వం పంపిన బిల్లు కేంద్రానికి అందిందా..? రాష్ట్రపతి ఆమోదం పొందే అవకాశం ఉందా..? అసలు బిల్లును ఆమోదించే ఉద్దేశం లేదా..? ప్రస్తుత పరిస్థితి ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా స్పందించారు. ఆయన ఇచ్చిన సమాధానం చూస్తే బిల్లుకు ఇప్పట్లో ఆమోదం లభించేలా కనిపించడం లేదు.

  ఇది చదవండి: వైసీపీలోని ఆ నేతల నుంచే జగన్ కు ప్రాణహాని.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు..


  ఏపీ దిశ బిల్లుల ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై రాజ్యసభలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎంపీ పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నపై స్పందించిన కేంద్రం.. ప్రస్తుతం దిశ బిల్లులు ఎక్కడున్నాయో కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఆయన ఇచ్చిన సమాధానం వింటే ఈ బిల్లు ఆమోదం పొందడానికి ఏపీ ప్రభుత్వం మరి కొన్నాళ్లు వేచి చూడక తప్పని పరిస్ధితి ఏర్పడింది. ఏపీ ప్రభుత్వం పంపిన దిశ బిల్లులు ప్రస్తుతం హోంశాఖ పరిశీలనలో ఉన్నాయని, న్యాయసలహా కోసం వీటిని పంపినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో క్లారిటీ ఇచ్చింది.అలాగే న్యాయశాఖ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం వివరణ కోరినట్లు వెల్లడించింది. ఈ వివరణ రాగానే రాష్ట్రపతికి పంపుతామని మంత్రి అజయ్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు..

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Parimal Nathwani, Parliament Winter session

  ఉత్తమ కథలు