Vijayasai Reddy: సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేరు వినపడితే చాలు ఎంపీ విజయసాయి (MP Vijayasai Reddy) రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారు. తాజాగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి రాహుల్‌పైనా.. అలాగే ఆయన పాదయాత్రపై నిత్యం ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా (Social Media ) వేదికగా కాంగ్రెస్ నేతను ఎదో ఒక పేరుతో విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల రాహుల్ తన తల్లి సోనియా షూలేస్ కడుతుండడం, ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడంపై కూడా సెటైర్లు వేశారు. ఆయన ఏ పని చేసినా విమర్శిస్తూనే ఉంటారనే ప్రచారం ఉంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.. కాంగ్రెస్ హయాంలోనే.. జగన్ పైనా.. విజయసాయి పైనా కేసులు నమోదు అయ్యాయి. ఇదంతా సోనియాగాంధీ చేసిన పనే అన్నది విజయసాయి రెడ్డి అభిప్రాయం.. అందుకే అవకాశం దొరికితే విమర్శిస్తూ ఉంటారు. అలాంటి విజయసాయి రెడ్డి తొలిసారి.. రాహుల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ వినమ్రత ఎంతో ‘గొప్పది’ అంటూ ఫేస్‌బుక్ వేదికగా ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని మండలం గ్రామాల్లో నడుస్తుండగా, ‘కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరతారా?’ అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు రాహుల్ జీ ఇచ్చిన జవాబు ఇది.
అంతేకాదు, ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎం. మల్లికార్జున ఖర్గే తన అధికార పరిధిలో అన్ని నిర్ణయాలూ తీసుకుంటారని కూడా నెహ్రూ–గాంధీ కుటుంబ వారసుడు చెప్పడం కూడా చాలా మందికి దిగ్భ్రాంతి కలిగించింది. భారత జాతీయ కాంగ్రెస్ లో ఎట్టకేలకు ప్రజాస్వామీకరణకు రాహుల్ గాంధీ జీ అవకాశం ఇస్తున్నందుకు ప్రజలు ‘సంతోషిస్తున్నారు.’ అంటూ విజయసాయి రెడ్డి పోస్ట్ చేశారు.
అయితే విజయసాయి రెడ్డి.. రాహుల్ గాంధీ వినమ్రతను కొనియాడుతూ.. వారసత్వ రాజకీయాలపై సెటైర్లు వేశారని.. నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొంమతంది విజయసాయి సెటైర్లను సమర్ధిస్తే.. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఏపీలో రాహుల్ పాద యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఆయన కీలక వ్యాఖ్యలు చశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను క్రమ పద్ధతిలో ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్ జోడో యాత్రను ఏపీలో ముగించుకొని కర్ణాటకలోనీ రాయచూరులో ప్రవేశిస్తున్న సందర్భంగా మాధవరం బ్రిడ్జిపై హాజరైన ప్రజల ఉద్దేశించి ప్రసంగించారు..
ఏపీ ప్రజలు తన భారత్ జూడో యాత్రకు అపారమైన మద్దతు ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది నిజంగా మరపురాని అనుభవంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో యాత్ర సందర్భంగా విభిన్న సమూహాలతో కలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన సమస్యలను వెలుగులోకి వచ్చాయన్నారు.
ఇదీ చదవండి: ఎన్ని మందలు వచ్చినా.. సింహం సింగిలే.. ఇకపై విశాఖ నుంచే పరిపాలన క్లారిటీ ఇచ్చిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు- అమరావతిలో ఒకే రాజధానిని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టు-బడి ఉన్నట్లు- పేర్కొన్నారు. భారతీయ ప్రజల ఆస్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ప్రభుత్వ రంగ హోదాను కొనసాగించడాన్ని తాము సమర్థిస్తున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Rahul Gandhi, Vijayasai reddy, Ycp