హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వైసీపీ మద్యపాన నిషేధం హామీ టీడీపీకి కలిసొస్తుందా... మద్యాన్ని నిషేధిస్తామనడం ప్రజలకు నచ్చట్లేదా...

వైసీపీ మద్యపాన నిషేధం హామీ టీడీపీకి కలిసొస్తుందా... మద్యాన్ని నిషేధిస్తామనడం ప్రజలకు నచ్చట్లేదా...

AP Assembly Elections 2019 : ఎన్నికల టైం దగ్గర పడుతున్నకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని మనల్ని ఆలోచనల్లో పడేస్తున్నాయి.

AP Assembly Elections 2019 : ఎన్నికల టైం దగ్గర పడుతున్నకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని మనల్ని ఆలోచనల్లో పడేస్తున్నాయి.

AP Assembly Elections 2019 : ఎన్నికల టైం దగ్గర పడుతున్నకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని మనల్ని ఆలోచనల్లో పడేస్తున్నాయి.

ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. మహిళలంతా ఒక్కటై... సంపూర్ణ మద్యపాన నిషేధం జరగాలని గళమెత్తారు. ఐతే... చంద్రబాబు హయాంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక సీన్ మారింది. అప్పటివరకూ అమల్లో ఉన్న మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారు. భారీ ఎత్తున వైన్ షాపులు, బార్లకు తలుపులు బార్లా తెరవడంతో... ప్రభుత్వ ఖజానాకు భారీగా డబ్బులొచ్చిపడుతున్నాయి. మందుబాబులంతా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతూ... మద్యం మత్తులో తూలుతున్నారు. ఇలాంటి సమయంలో... వైసీపీ అధినేత జగన్ తన నవరత్నాల హామీల్లో భాగంగా... మద్యపాన నిషేధం తెస్తామన్నారు. దాన్ని మూడు దశల్లో నిర్మూలిస్తామన్నారు. మద్యాన్ని పూర్తిగా నిషేధించాకే... 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని మరీ హామీ ఇచ్చారు. అంతేకాదు... మద్యాన్ని ఉన్నట్టుండి మానేస్తే... ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ నుంచీ కాపాడేందుకు సరైన ట్రీట్‌మెంట్ కోసం ప్రతి నియోజకవర్గంలో ఓ ఆస్పత్రిని కూడా ఏర్పాటుచేస్తానన్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఓటర్లకు... జగన్ అభిప్రాయం నచ్చలేదని తెలుస్తోంది.

మద్యమే ప్రియం : మద్యం తాగడమన్నది ఈ రోజుల్లో కామన్ ఇష్యూ అయిపోయింది. పేదవాళ్ల మొదలు... ధనవంతుల వరకూ అందరూ మద్యం తాగుతున్నారు. ఒకప్పుడు ఇళ్ల బయట మాత్రమే మద్యాన్ని తాగుతున్న ప్రజలు... ఈ రోజుల్లో ఇళ్లలోనే బార్లు పెట్టుకుంటున్నారు. కొంతమందైతే ఇంట్లో మహిళలతో కలిసి మరీ మద్యం తాగుతున్నారు. ఒకప్పుడు చీప్ లిక్కర్ మాత్రమే తాగే ప్రజలు... ఇప్పుడు కాస్త మంచి బ్రాండ్లను వాడుతున్నారు. మద్యంలో కూడా క్వాలిటీ మెయింటేన్ చేస్తున్నారు. చాలా మంది మహిళలు కూడా మద్యం తాగడాన్ని స్టేటస్ సింబల్‌లా భావిస్తున్నారు. అందువల్లే ఇదివరకట్లా మద్యపాన నిషేధం కోరుతూ ఎవరూ రోడ్డెక్కట్లేదు. అలాంటి ఉద్యమాలు దాదాపు జరగట్లేదు. అంటే ఒకరకంగా మద్యపాన నిషేధం అనే అంశం ఫేడవుట్ అయిపోయిందన్నమాట. అలాంటి అంశాన్ని జగన్ మళ్లీ తెరపైకి తెచ్చారనీ, ప్రజలకు ఇష్టం లేని నిర్ణయం తీసుకొని... దాన్ని వందశాతం అమలు చేసేందుకు కంకణం కట్టుకున్నారని కొందరంటున్నారు.

విప్లవాత్మక నిర్ణయాలకు ప్రజల మద్దతు తప్పనిసరి. ప్రజలకు ఇష్టం లేని నిర్ణయం అమలు కాదు. గుజరాత్‌లో మద్యపాన నిషేధం ఉన్నా అది చక్కగా అమలు కావట్లేదు. బహిరంగ ప్రదేశాల్లో దూమపానం నిషేధం... కానీ అది అమలవుతోందా... లేదు కదా... గుజరాత్‌లో మద్యపాన నిషేధం పరిస్థితీ అలాగే ఉంది. ప్రభుత్వం చెప్పేది చెబుతుంటే... ప్రజలు తమకు కావాల్సింది రకరకాల మార్గాల్లో పొందుతున్నారు. అంతెందుకు... వైసీపీ నేతలు, అభ్యర్థులు, కార్యకర్తల్లో ఎంతమందికి మద్యం అలవాటు లేదో జగన్ చెప్పగలరా? వాళ్లంతా మద్యాన్ని వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న ప్రశ్నలకు లేదన్నదే సమాధానంగా వినిపిస్తోంది. జగన్ ఓ మంచి ఉద్దేశంతో ఈ హామీ ఇస్తున్నా... మద్యానికి బానిసలైపోయిన ప్రజలు... ఈ హామీని లైట్ తీసుకుంటున్నారనీ... జగన్ అధికారంలోకి వస్తే, తమకు మద్యం లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారని తెలిసింది.

టీడీపీ అధినేత చంద్రబాబు... మద్యం విషయంలో ఎక్కడా ఎలాంటి కండీషన్లూ పెట్టట్లేదు. పైగా ఎక్సైజ్ పన్ను బాగా వస్తోందనీ, దాన్ని ఉపయోగించి మరిన్ని ప్రభుత్వ పథకాలు తేవొచ్చని భావిస్తున్నారు. అందువల్ల మద్యపాన నిషేధం అన్న ఊసే ఎత్తట్లేదు. ప్రజలు కూడా ఏ కొద్ది మందో తప్పితే... జనాభాలో ఎక్కువ మంది మద్యాన్ని కోరుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే... విదేశీ బ్రాండ్లు తేవాలని ఆశిస్తున్నారు. అందువల్ల మద్యపాన నిషేధం హామీ... వైసీపీకి కలిసిరాదని టీడీపీ నేతలు భావిస్తున్నారట. ఆవేశంలో జగన్ ప్రజలతోపాటూ... సొంత పార్టీ నేతలకే ఇష్టంలేని నిర్ణయం తీసుకున్నారని చెప్పుకుంటున్నారట. మరి ప్రజలు జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అన్నది ఎన్నికల ఫలితాలతో తేలనుంది.


ఇవి కూడా చదవండి :

రేపటి నుంచీ ఐదు రోజులు టీడీపీ నిరసన కార్యక్రమాలు... ఎన్నికలు జరిగే రోజున కూడా...

ఎండు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే.... ప్రయోజనాలు ఇవీ...

#Health Tips: పెసలు తింటే ఎన్ని లాభాలో చూడండి..

First published:

Tags: Andhra, Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu Naidu, Ys jagan

ఉత్తమ కథలు