Power projects to Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు కేంద్ర ప్రభుత్వం (Central Government) శుభవార్త చెప్పింది. తాజాగా రాజ్యసభలో ఎంపీ పరిమళ్ నత్వానీ (MP Parimal Nathwani) .. ఏపీలో పునరుత్పాదక శక్తికి సంబంధించి కేంద్రమంత్రిని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ (Central Minster RK Singh) సానుకూల సమాధానం చెప్పారు. ఏపీ మొత్తం పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యం 10,825.28 మెగావాట్లలో 4096.65 మెగావాట్ల పవన విద్యుత్ అని.. ఇక 4390.48మెగావాట్ల సౌర విద్యుత్, 1610 మెగావాట్ల బారీ జలవిద్యుత్, 566.04 మెగావాట్ల బయో పవర్, 162.11 మెగావాట్ల చిన్న జలవిద్యుత్ ద్వారా ఏపీకి విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ఈ సందర్భంగా ఇంధన స్థాపిత సామర్థ్యంతో పాటు.. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పునరుత్పాదక ఇంధనం.. దేశ వ్యాప్తంగా పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. అందులో ఏపీకి కేటాయింపుల పరిస్థితి ఏంటి అని పరిమల్ నత్వాని కేంద్రాన్ని ప్రశ్నించారు.
కొత్తగా ప్రారంభించ బోయే పథకాల గురించి అడిగిన ప్రశ్న కుసమాధానంగా స్మాల్ గ్రిడ్ కనెక్ట్స్ సోలార్ ఎనర్జీ పవర్ ప్లాంట్లు, స్టాండ్-అలోన్ సోలార్ పవర్స్ అగ్రికల్చర్ పంపులు, ఇప్పటికే ఉన్న గ్రిడ్ కనెక్ట్స్ వ్యవసాయ పంపుల సోలారైజేషన్‌వంటి వాటిని ప్రభుత్వం పీఎం కుసుమ్ ( PM-KUSUM ) పథకం కింద ప్రారంభించిందని వివరించారు.
అలాగే ఈ పథకం ద్వారా కేవలం రైతులకు మాత్రమే కాకుండా రాష్ట్రాలు, డిస్కస్‌లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. ముఖ్యంగా వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ కోసం అందించే సబ్సిడీపై రాష్ట్రాలు మరింత ఆదా అవుతుందని హామీ ఇచ్చారు. డిస్క్‌లు టెయిల్ ఎండ్‌లో తక్కువ సౌర విద్యుత్‌ను పొందతాయని, ప్రసార, పంపిణీ నష్టాలను సైతం ఆదా చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : బాబోయ్ బాహుబలికి బాబులా ఉంది..? ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండరు..?
తాజాగా మంత్రి ఇచ్చి సమాధానం ప్రకారం.. ఏపీకి సోలార్ పార్కులు, అల్ట్రా-మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అభివృద్ధి పథకం కింద 40,000 మెగావాట్ల సామర్ధ్యం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కోసం మౌలిక సదుపాయాల కల్పనకు చట్టబద్ధమైన అనుమతులకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు.
ఇదీ చదవండి: మంత్రి బొత్స ఇలాకాపై టీడీపీ ఫోకస్.. ఆ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఫిక్స్ చేసే ఛాన్స్
హై ఎఫిషియన్సీ సోలార్ పివి మాడ్యూల్స్‌లో గిగావాట్లు (జిడబ్ల్యు) స్కేల్ తయారీ సామర్థ్యాన్ని సాధించడం కోసం ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్స్ ఇన్సెంటివ్ స్కీమ్ 'నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ హై ఎఫిషియన్సీ సోలార్ పివి మాడ్యూల్స్' ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. దీంతో పాటు గ్రిడ్ కనెక్ట్ చేయబడిన సోలార్ రూఫ్‌టాప్ పవర్ ప్లాంట్‌ల కోసం మంత్రిత్వ శాఖ రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ ఫేజ్ IIని కూడా ప్రారంభించిందన్నారు. దీనిద్వారా బేస్‌లైన్ మెంట్ ఎక్కువ రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్య సాధించడం కోసం నివాస రంగానికి, ప్రోత్సాహకాలు అందించినట్టు అవుతుందని మంత్రి సమాధానం చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Parimal Nathwani, Solar power