HOME »NEWS »ANDHRA PRADESH »ycp mlc challa ramakrshna reddy died of corona prn

Corona Virus: కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి...

Corona Virus: కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి...
చల్లా రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా (Corona Virus) మహమ్మారి మరో ప్రజాప్రతినిథిని బలిగొంది. వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి (MLC Challa Ramakrsihna Reddy) కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు.

  • Share this:
    కరోనా మహమ్మారి మరో ప్రజాప్రతినిథిని బలిగొంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కరోనాతో మృతి చెందారు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.గత నెల 13న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కర్నూలు జిల్లా అవుకుకు చెందిన చల్లా రామకృష్ణా రెడ్డి ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత టీడీపీ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేశారు. గతేడాది టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

    ఆరు నెలల క్రితమే చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చల్లా రామకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కుటంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చల్లా మృతిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ భ్యులకు సానుభూతి తెలిపారు.



    జిల్లాపై తనదైన ముద్ర

    కర్నూలు జిల్లా పాలిటిక్స్ లో  చల్లా రామకృష్ణారెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. 1948లో అవుకు మండలం ఉప్పలపాడులో ఆయన జన్మించారు. తండ్రి చల్లా చిన్నపురెడ్డి.  చల్లాకు ఇద్దరు కుమారులు భగీరథరెడ్డి, విఘ్నేశ్వరరెడ్డి,  ఇద్దరు కుమార్తెలు బృంద, పృథ్వీ ఉన్నారు. 1983లో చల్లా రామకృష్ణారెడ్డి తొలిసారిగా పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1989లో డోన్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991లో నంద్యాల పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు కర్రా సుబ్బారెడ్డి, ఎర్రబోతులను ఓడించి.. రెండు సార్లు వరుసగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల స్థానం కనుమరుగయ్యింది.

    ఆ తర్వాత కోవెలకుంట్ల, అవుకు, సంజామల, కొలిమిగుండ్ల, బనగానపల్లె మండలాలతో బనగానపల్లె నియోజకవర్గం ఏర్పడింది. ఈ క్రమంలో బనగానపల్లె నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన చల్లా అప్పటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ దక్కకపోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డి గెలుపు కృషి చేశారు. ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీకి, తన పదవికి రాజీనామా చేసి..  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ బనగానపల్లె అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల అనంతరం వైసీపీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది.
    Published by:Purna Chandra
    First published:January 01, 2021, 10:26 IST