MLA Roja on KCR: వైసీపీ నగర ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఆధ్యాత్మిక బాట పట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లో బిజి బిజీగా గడుపుతున్న ఆమె.. ఓ వైపు వ్యక్తిగ కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. ఆద్మితక చింతన చేస్తున్నారు. అవకాశం ఏమాత్రం ఉన్నా గుళ్లు, గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా యాదాద్రి (Yadadri Temple) లో ఆమె పర్యటించారు. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అక్కడే స్వామి వారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ఆలయాన్ని మొత్తం తిరిగి.. పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం జరుగుతున్న డవలప్ మెంట్ చూసిన తరువాత.. యాదాద్రి వైభవాన్ని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవడం లేదన్నారు. పూర్తిగా నిర్మాణమైన తారువాత దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా నిలవడం ఖాయమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ నరసింహ స్వామే.. సీఎం కేసీఆర్‌తో ఇంత మంచి గుడి కట్టించుకున్నట్లు అనిపిస్తోందని రోజా వ్యాఖ్యనించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను కారణజన్ముడు అంటూ రోజా కొనియాడారు. చిన్న గుడి కట్టాలంటే భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, సీఎం కేసీఆర్ అందరి సహకారంతో, దేవుడి ఆశీస్సులతో ఆలయాన్ని నిర్మించారని కొనియాడారమే.
ప్రస్తుతం జరుగుతున్న పనులు చూస్తుంటే.. యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా నిర్మిస్తున్నారని అభిప్రాయపడ్డారు. యాదాద్రిని ప్రపంచ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఆయన సంకల్పం మెచ్చుకోదగిదనన్నారు. ఈ కాలంలో ఏ నాయకుడికీ దక్కని అవకాశం కేసీఆర్‌కి దక్కిందన్నారు. నూతన ఆలయాన్ని అద్భుతంగా డిజైన్ చేసి పునఃనిర్మాణం చేశారని అన్నారు.
MLA Roja Visited Yadadri Tmple in Telangana || సీఎం కేసీఆర్ కారణజన్ముడు ... https://t.co/MwpwXbQgXu via @YouTube #rojajabardasth #rojacrush #rojalovers #CMKCR #KCR @yadadrionline
— nagesh paina (@PainaNagesh) February 12, 2022
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ అన్నదమ్ములే అనడానికి ఈ గుడి ఒక ప్రతీకగా నిలుస్తుందని రోజా అభిప్రాయపడ్డారు. అలాగే ఆలయ నిర్మాణానికి వాడిన రాయిని గుంటూరు నుంచి తీసుకువచ్చారని, ఈ కారణంగానే.. తెలుగువారు ఎప్పటికీ అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెల్లుగా కలిసి ఉంటారని ఆమె పేర్కొన్నారు.
యాదాద్రి స్వామి వారి చెంత చాలా సమయం గడిపిన రోజా.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదాశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇటీవల రోజా ఆలయాలు, పుణ్యక్షేత్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవలే ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన సమతా మూర్తి విగ్రహాన్ని ఆమె సందర్శించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఆ సందర్భంలోనూ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. సమతామూర్తి దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు రోజా.. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు చేయడం చాలా సాహసం అని రోజా అభిప్రాయపడ్డారు. ఇది ఎవరూ చేయలేరని అన్నారు. మన ఇళ్లలో ఒక్క యాగం చేయడమే గగనం అలాంటిది ఇక్కడ 1035 హోమ గుండాలతో హోమం చేయడం చాలా గొప్ప కార్యం అన్నారు. అవకాశం ఉన్న ప్రతి సారి ఆమె ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.