హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MLA Roja: తగ్గేదే లే అంటున్న ఫైర్ బ్రాండ్.. ఇది మా విజయం అంటున్న ఎమ్మెల్యే రోజా..

MLA Roja: తగ్గేదే లే అంటున్న ఫైర్ బ్రాండ్.. ఇది మా విజయం అంటున్న ఎమ్మెల్యే రోజా..

ఇక ఆమెకు మంత్రి పదవి దక్కలేదని కేడర్ పూర్తిగా నిరశాలో ఉన్నప్పుడు అనూహ్యంగా ఆమె పేరు తెరపైకి వచ్చింది. తుది కసరత్తుగా ఆమె పేరును చేర్చారు సీఎం జగన్.. ఆమెకు సమాచారం కూడా అందించారు. దీంతో ఇప్పుడు రోజాకు ఏ పదవి ఇస్తారంటూ ప్రచారం మొదలైంది.. అయితే చాలామంది రోజాకు హోం మంత్రి దక్కుతుందని ముందే జోస్యం చెబుతున్నారు..

ఇక ఆమెకు మంత్రి పదవి దక్కలేదని కేడర్ పూర్తిగా నిరశాలో ఉన్నప్పుడు అనూహ్యంగా ఆమె పేరు తెరపైకి వచ్చింది. తుది కసరత్తుగా ఆమె పేరును చేర్చారు సీఎం జగన్.. ఆమెకు సమాచారం కూడా అందించారు. దీంతో ఇప్పుడు రోజాకు ఏ పదవి ఇస్తారంటూ ప్రచారం మొదలైంది.. అయితే చాలామంది రోజాకు హోం మంత్రి దక్కుతుందని ముందే జోస్యం చెబుతున్నారు..

MLA Roja: జగన్ అన్న అంటే అంతులేని అభిమానం ఉంది అంటారు ఎమ్మెల్యే రోజా.. ఆయన తనకు దేవుడి ఇచ్చిన అన్న అని పలు సందర్భాల్లో చెప్పారు కూడా.. అందుకే జగన్ ను ఎవరైనా పల్లెత్తు మాట అంటే తట్టుకోలేరు. వెంటనే కౌంటర్లు.. జబర్దస్త్ పంచ్ లు పేలుస్తారు. తాజాగా సీఎం జగన్ పై వస్తున్న విమర్శలకు పవర్ ఫుల్ పంచ్ తో సమాధానం చెప్పారు.

ఇంకా చదవండి ...

MLA Roja:  కేంద్ర ప్రభుత్వం (Central Government) పదే పదే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా.. ఏపీ ప్రభుత్వం (AP Government) కనీసం విమర్శలు చేయడం లేదని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి.. కేవలం కేసులకు భయపడి కేంద్రాన్ని సీఎం  జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఏమీ అనడం లేదని..  ఆయన కేంద్ర చేతిలో కీలబొమ్మ కాబట్టే.. కేంద్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తోందనే విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు.. అయితే ఇప్పటి వరకు ఆయన ఈ విమర్శలకు సమాధానం ఇవ్వడం లేదు.. పలుమార్లు కేంద్రాన్ని కలుస్తున్నారు. పలు డిమాండ్లను వారి ముందు ఉంచుతూనే ఉన్నారు. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ (Delhi) వెళ్లినా.. ప్రత్యేక హోదా (Special Status) గురించి కేంద్రాన్ని వినతి పత్రం సమర్పించారని.. వైసీపీ నేతలు (YCP Leaders) చెప్పే మాట.. కానీ బీజేపీ నేతలు (BJP Leaders) మాత్రం ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని.. ఏపీ ప్రభుత్వం కావాలనే ప్రజలను మభ్య పెట్టడానికి ప్రత్యేక హోదా కోరామంటూ డ్రామాలు ఆడుతోందని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీంతో ఇక ప్రత్యేక హోదా లేనట్టే అని చాలామంది భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా ఏపీ విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం కమిటీ వేసింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు.

జగన్ అంటే ఏంటో తెలిసిందా అంటూ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.. ఏపీ ప్రభుత్వం ఎప్పుడు తగ్గేదే లేదు అన్నారు. కేంద్రం కుదరదు అన్నదాన్ని కూడా సుసాధ్యం చేయించడం జగన్ విజయం అన్నారు. తాజాగా ఏపీ విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం కమిటీ వేయడం శుభపరిణామం అని ఆమె అన్నారు. దీనిని సీఎం జగన్ సాధించిన విజయంగా అభివర్ణించారు.

ఇదీ చదవండి : కొత్త జిల్లాలపై అభ్యంతరాలు ఉన్నాయా..?ఇలా చెప్పొచ్చు.. పత్యేక కమిటీ ఏర్పాటు

గత నెల కూడా సీఎం జగన్ విభజన సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని రోజా గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీతో రాజీపడ్డ చంద్రబాబుకు.. ఇది చెంపపెట్టు అన్నారు రోజా. మన కష్టం, నష్టం గమనించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని, ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు రోజా. విభజన సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ చేసిన పోరాటానికి ఫలితం దక్కనుందని రోజా చెప్పారు.

ఇదీ చదవండి : ఏపీలో మెగా స్టూడియో..? ప్లేస్ ఫైనల్ చేశారా..? అదే దారిలో మహేష్..!

ఎవరి విమర్శలు ఎలా ఉన్నా. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత మిగిలిపోయిన సమస్యల పరిష్కారంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. వివాదాల పరిష్కారానికి ముగ్గురు సభ్యలతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులుగా కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశిశ్, ఏపీ ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, తెలంగాణ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉన్నారు. అయితే ఇంతకాలం ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశం అని కేంద్ర హోం శాఖ తేల్చి చెప్పేస్తే.. స్పెషల్ స్టేటస్ అంశాన్ని చేర్చడం హాట్ టాపిక్ అవుతోంది.

ఇదీ చదవండి : సీఎం కుటుంబ సభ్యుల్లో ఒకరికి కీలక పదవి.. రాజధానికి ముహూర్తం ఫిక్స్..?

కమిటీ సమావేశంలో ఎజెండాలోని కీలక అంశాలు..

ప్రత్యేక హోదా

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన

ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యల పరిష్కారం

పన్నుల వ్యవహారంపై చర్చ

క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ డిపాజిట్ విభజన

వనరు వ్యత్యాసంపై చర్చ

రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గ్రాంట్ పై చర్చ

పన్నులు, ప్రోత్సాహాలు

సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల మధ్య క్యాష్ క్రెడిట్ పై చర్చ

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Special Status, MLA Roja

ఉత్తమ కథలు