హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MLA Roja: ఎమ్మెల్యే రోజా, మాజీ మంత్రి యనమలకు తప్పిన విమాన ప్రమాదం? అసలేం జరిగిందంటే?

MLA Roja: ఎమ్మెల్యే రోజా, మాజీ మంత్రి యనమలకు తప్పిన విమాన ప్రమాదం? అసలేం జరిగిందంటే?

2004 నుంచి రాజకీయాల్లో ఉన్నా.. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆమెక ఆ కోరిక బలంగా ఉండిపోయింది. ఒక్కసారైనా మంత్రి అని అనిపించుకోవాలని ఆరాటపడేవారు.. అయితే ఎట్టకేలకు ఆమె కోరిక ఫలించింది.. దేవుడుకు చేసిన పూజలు ఫలించాయో.. లేకో నిత్యం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం.. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఎదురైనా ధైర్యంగా నిలబడి పోరాడడం అధినేతను ఆకర్షించాయో.. కారణం ఏదైనా ఆమె మంత్రి అయ్యారు.

2004 నుంచి రాజకీయాల్లో ఉన్నా.. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆమెక ఆ కోరిక బలంగా ఉండిపోయింది. ఒక్కసారైనా మంత్రి అని అనిపించుకోవాలని ఆరాటపడేవారు.. అయితే ఎట్టకేలకు ఆమె కోరిక ఫలించింది.. దేవుడుకు చేసిన పూజలు ఫలించాయో.. లేకో నిత్యం నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం.. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఎదురైనా ధైర్యంగా నిలబడి పోరాడడం అధినేతను ఆకర్షించాయో.. కారణం ఏదైనా ఆమె మంత్రి అయ్యారు.

MLA Roja: ఎమ్మెల్యే రోజా, టీడీపీ నేత యనలమలకు ఇండిగో అధికారులు చుక్కలు చూపించారు. విమాన ప్రమాదం నుంచి వారు తప్పించుకున్నారు. అయితే దీనికి ఇండిగో అధికారుల తీరుపై ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో కేసు వేస్తామన్నారు.

MLA Roja: ఎమ్మెల్యే రోజా (MLA Roja), టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల (Yanaka Ramakrishnudu)కు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరుపతి (Tirupati)లో దిగాల్సిన విమానం బెంగళూరు (Bangalore)లో సురక్షితంగా ల్యాండైంది. అప్పటికీ డోర్ ఓపెన్ కాకపోవడంతో సుమారు నాలుగు గంటలకు పైగా ఫ్లైట్ లోనేఉండాల్సి వచ్చింది. రాజమండ్రి (Rajmundry) నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంకు ల్యాండింగ్ సమస్య ఏర్పడింది. దాదాపు గంటపాటు ఈ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అనంతరం ఫైలెట్ విమానాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్‌లో ల్యాండ్ చేశారు . అక్కడ కూడా సమస్య తప్పలేదు. అయితే ఏం జరుగుతోంది అన్నది మాత్రం ప్రయాణికులకు చెప్పడానికి ఇండిగో సిబ్బంది అధికారులు తిరస్కరించారు.. దీంతో అంతా భయభ్రాంతులకు గురయ్యారు. కాగా ఈ విమానం నగరి ఎమ్మెల్యే రోజాతోపాటు, టీడీపీ సీనియర్ నేతలు యనమల, టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఉన్నారు.

వాతావరణ సమస్య వలన ఇలా జరిగిందా లేదంటే సాంకేతిక సమస్య ఏర్పడిందా అనే దానిపై సిబ్బంది ఒక్కొక్కరు ఒక్కొలా సమాధానం చెబుతున్నారు. అయితే లేటైనా విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఇండిగో  సంస్థ ప్రయాణికులను తరలించేందుకు ఏర్పాట్లు చేయలేదు.

ఇదీ చదవండి: మంచు కురిసేవేళలో ‘ఆంధ్రా కాశ్మీర్’ అందాలు చూడాల్సిందే.. లంబసింగి చుట్టూ అద్భుత ప్రదేశాలు ఇవే..

ఇండిగో తీరుపై ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రయాణికుల ప్రాణాలతో ఇండిగో అధికారులు , సిబ్బంది ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. సాంకేతిక లోపమే అయినా ప్రయాణికులకు సమాచారం ఇవ్వాలని.. ల్యాండ్ అయిన తరువాత కూడా ఎందుకు అంత సేపు ఫ్లైట్ లో ఉంచాల్సి వచ్చింది అన్నది కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు..

ఇదీ చదవండి: ఫ్యామిలీ సర్టిఫికెట్ అడిగిన మహిళ.. హోటల్ కు వస్తే పనైపోతుందన్న తహసీల్దార్.. సహజీవనం చేస్తున్న మహిళ ఫ్లాట్ లోనే వ్యవహరం..?

సాంకేతిక లోపంతో విమానం ఆగిపోతే.. బెంగళూర్ వెళ్లినందుకు ప్రయాణికుల నుంచి ఐదు వేల రూపాయలు బలవంతంగా వసూలు చేశారని.. దీనిపై తాను కోర్టుకు వెళ్తాను అన్నారు రోజా.. ఇండిగో అధికారులపై డిఫర్మేషన్ కేసు కచ్చితంగా వేసి తీరుతాను అన్నారు. ప్రయాణికులతో వారు ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు..

ఇదీ చదవండి: ఒక్కరోజు టీ,కాఫీ ఖర్చు అన్ని లక్షలా..? విపక్షాల మండిపాటు

ఇటు టీడీపీ నేత యనమల సైతం సిబ్బంది, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. క్షేమంగా చేరుకున్నందుకు ఆనందంగానే ఉన్నా..  ప్రయాణికుల ప్రాణాలతో ఇలా ఆటాలు ఆడుకోవడం దారుణమన్నారు.


ఇదీ చదవండి: 14.29 శాతం ఫిట్‌మెంట్‌.. 72 గంటల్లో నిర్ణయం.. ఉద్యోగ సంఘాల పెదవి విరుపు

రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న సమయంలో సాంకేతిక లోపం ఏర్పడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇండిగో విమానం కు ల్యాండింగ్ సమస్య ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో తిరుపతి ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ సాధ్యం కాక గంట సమయం గాలిలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. చివరకు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Judge roja, MLA Roja, Nagari MLA Roja, Tirupati, Yanamala Rama Krishnudu

ఉత్తమ కథలు