ఆ వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో తీరని విషాదం..

ఏపీ సీఎం వైఎస్ జగన్

పార్లమెంటులో ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేసి నాగభూషణరావు పదవీవిరమణ చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే శాంతి భర్త నాగభూషణరావు మృతిపట్ల మంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇంటిలో తీరని విషాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త రెడ్డి నాగభూషణరావు అనారోగ్యంతో ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చనిపోయారు. గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్లమెంటులో ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేసి నాగభూషణరావు పదవీవిరమణ చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే శాంతి భర్త నాగభూషణరావు మృతిపట్ల మంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని చికిత్స తీసుకుంటున్న నాగభూషణరావు ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్న విషయాన్ని మంత్రి ధర్మాన గుర్తు చేసుకున్నారు. నాగభూషణరావు చనిపోయాడనే విషయం తెలిసిన వెంటనే విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం నాగభూషణరావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
    Published by:Narsimha Badhini
    First published: