హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP MLA: సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు.. అంతా చంద్రబాబు మనుషులే.. వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్

YCP MLA: సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు.. అంతా చంద్రబాబు మనుషులే.. వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్

YCP MLA: టాలీవుడ్ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లంతా బలిసి కొట్టుకుంటున్నారంటూ విమర్శించారు.. సినిమా పెద్దలు అంతా చంద్రబాబు మనుషులే అంటే మరో వివాదానికి తెరలేపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.?

  YCP MLA on Tollywood: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి -టాలీవుడ్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఓ వైపు మంత్రులతో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ట్వీట్ల వార్ కు బ్రేక్ పడింది అనుకున్న సమయంలో.. మరో వివాదానికి తెరలేచింది. ఇటీవల తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్న వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ (Nallapu Reddy Prasanna kumar Reddy).. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నేరుగా టాలీవుడ్ (Tollywood) పెద్దలకు టార్గెట్ చేశారు.. సినిమా వాళ్లు ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ మండిపడ్డారు. కోవూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు సినిమా వాళ్ల గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లంతా హైదరాబాద్‌ (HYderabad)లో ఉన్నారని.. అసలు వారికి ఏపీలో ఒక ప్రభుత్వం ఉన్నారని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఉన్నారని కనిపిస్తోందా అని ప్రశ్నించారు.

  అక్కడితో నే ఆయన ఆగలేదు.. సినిమాలో ఉన్న పెద్దలంతా చంద్రబాబు మనుషులే.. అని.. ఆయన కులానికి చెందిన వారే ఎక్కువమంది ఇండస్ట్రీలో ఉన్నారంటూ మరో వివాదానికి తెరలేపారు. అసలు హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.. పేదల కోసం టికెట్ల ధరలు తగ్గిస్తే వారికి వచ్చిన నష్టం ఏంటని ఆయన ప్రశ్నించారు..

  ఇదీ చదవండి : ఇవీ మా సమస్యలు.. పరిష్కరిస్తారా..? మంత్రితో వర్మ

  ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి -టాలీవుడ్ కి మధ్య వివాదం ముదురుతోంది. సినిమా పెద్దలంతా బహిరంగంగానే ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.  పవన్ కళ్యాణ్, నాని లు బహిరంగంగానే  వ్యాఖ్యలు చేయగా.. చిరంజీవి ట్విట్టర్లో  వినతులు చేశారు. ఇటు దర్శకులు, నిర్మాతలు సైతం ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.

  ఇదీ చదవండి : అక్కడ మహిళలకు నో ఎంట్రీ.. పొంగళ్లు పెట్టేదీ మగవారే.. ఎందుకో తెలుసా..?

  ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే నేరుగా మంత్రులపై ట్విట్టర్ లో యుద్ధమే చేశారు. మంత్రి పేర్ని నానికి పది ప్రశ్నలు సధించారు. దానికి మంత్రి పేర్ని నాని అదే స్థాయిలో సమాధానాలు చెప్పారు. అక్కడితో వివాదం ఆగలేదు.. మళ్లీ ఆయన చెప్పిన సమాధానాలకు వర్మ కౌంటర్లు వేశారు..

  ఇదీ చదవండి : భోగీ రోజు చిన్నపిల్లలకు పోసే రేగి పండుతో ఇన్ని ప్రయోజనాలా..? చలికాలంలో ఎందుకు తినాలి..?

  అయితే వివాదం ఇంకా పెద్దది చేయడం ఇష్టం లేక మంత్రిని కలిసి తమ సమస్య చెప్పుకుంటామని వర్మ కోరారు. దానికి మంత్రి కూా ఒకే చెప్పారు. దీంతో తాజాగా ఇద్దరు తాడేపల్లి సచివాలయంలో భేటీ అయ్యారు.. సినిమా సమస్యలపై రామ్ గోపాల్ శర్మ మంత్రికి వివరిస్తున్నారు.. మరి దీనికి మంత్రి ఎలాంటి సమాధానం చెబుతారు అన్నది చూడాలి..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Tollywood, Ycp

  ఉత్తమ కథలు